ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రీడాకారుల వేలం మొదలైంది. శని, ఆదివారం రెండు రోజుల పాటు ఈ వేలం జరుగుతోంది. బెంగుళూరు కేంద్రంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు రోజులు పాటు జరిగే ఈ వేలంలో పది జట్లు క్రీడాకారులను కొనుగోలు చేయనుంది. ఇప్పుటికే అగ్రశ్రేణి క్రీడాకారులను ఆయా జట్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 27 మంది ఆటగాళ్లను ఎనిమిది ప్రాంఛైజీలు సొంతం చేసుకోగా మిగిలిన 590 మంది క్రీడాకారులను కొనుగోలు చేసేందుకు ఈ వేలం నిర్వహిస్తున్నారు.
దేశంలో మరో క్రికెట్ పండగ దగ్గరపడుతోంది. ఐపీఎల్ పోటీల్లో కీలకమైన క్రీడాకారుల కొనుగోలు ఆరంభమైంది. ఐపీఎల్ మెగా పండగలో ఆట కన్నా ముందు క్రీడాకారుల కొనుగోలే ఎక్కువ ఆసక్తికరం. క్రీడాకారుల కొనుగోలు కోసం ఒక్కొక్కొ జట్టుకు రూ.90 కోట్లు కేటాయించారు. ఈ సొమ్ముతోనే మొత్తం క్రీడాకారులను కొనుగోలు చేయూలనే నిబంధన ఉంది. వేలానికి ముందే పలు జట్లు ముగ్గురు, నలుగురు చొప్పున పాత ఆటగాళ్లను కొనుగోలు చేసింది. మిగిలిన సొమ్ములతో ఆయా జట్లు 11 మంది నుంచి 21 మంది వరకు కొనే అవకాశముంది.
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ భారత్‌కు చెందిన రవీంద్ర జడేజాను రూ.16 కోట్లకు, మహేంద్ర సింగ్ ధోనీని రూ.12 కోట్లకు, రుతిరాజ్ గైక్వాడ్‌ను రూ.6 కోట్లకు, మోయిన్ అలీ (ఇంగ్లాండ్)ని రూ.8 కోట్లుకు కొనుగోలు చేసింది. ఈ జట్టు వద్ద క్రీడాకారులను కొనుగోలు చేసేందుకు ఇంకా 48 కోట్లు ఉంది.
ముంబై ఇండియన్స్ జట్టు భారత్‌కు చెందిన రోహిత్ శర్మను రూ.16 కోట్లుకు, బూమ్రాను రూ.12 కోట్లుకు, సూర్యకుమార్ యాదవ్‌ను రూ.8 కోట్లకు, పోలార్డ్ (వెస్టిండీస్)ను రూ.6 కోట్లకు కొంది. ముంబై జట్టుకు ఇంకా రూ.48 కోట్లు చేతిలో ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కె.విలయమ్సన్ (న్యూజిల్యాండ్) రూ.14 కోట్లు, భారత్‌కు చెందిన అబ్దుల్ సమద్ రూ.4 కోట్లు, ఉమ్రన్ మలిక్ రూ.నాలుగు కోట్లకు చేజిక్కించుకోంది. ఈ జట్టుకు రూ.68 కోట్లు క్రీడాకారుల కొనుగోలుకు అవకాశముంది.
ఢిల్లీ క్యాపిటల్స్ రిషబ్ పంత్ రూ.16 కోట్లు, అక్సర్ పటేల్ రూ.9 కోట్లు, పృద్వి షా రూ.7.50 కోట్లు, ఆండ్రిచ్ నోకియా (సౌత్ ఆఫ్రికా)ను రూ.6.50 కోట్లు చొప్పున కొనుగోలు చేయగా, ఈ జట్టుకు ఇంకా క్రీడాకారులను కొనుగోలు చేసేందుకు రూ.47.50 కోట్లు ఉంది.
కోల్కత్తా నైట్ రైడర్స్ జుట్టు రసేల్ (వెస్టిండీస్)ను రూ.12 కోట్లు, సునీల్ నైరేన్ (వెస్టిండీస్) రూ.6 కోట్లు చొప్పున కొనుగోలు చేయగా, భారత్‌కు చెందిన వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్‌లను రూ.8 కోట్ల చొప్పున కొనుగోలు చేశారు. ఈ జట్టుకు ఇంకా రూ.48 కోట్లు చేతిలో ఉంది.
పంజాబ్ కింగ్స్ కేవలం భారత్‌కు చెందిన మయాంక్ అగర్వాల్ రూ.12 కోట్లు, హరదీప్ సింగ్‌ను రూ.4 కోట్ల చొప్పున కొనుగోలు చేశారు. ఈ జట్టుకు ఇంకా రూ.76 కోట్లు ఉంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు భారత్‌కు చెందిన సంజీవ్ శ్యామ్సన్ రూ.14 కోట్లు, జైస్వాల్ రూ.4 కోట్లు చొప్పున కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్‌కు చెందిన బట్లర్ రూ.10 కోట్లుకు కొనుగోలు చేయగా, ఇంకా రూ.62 కోట్లతో క్రీడాకారులను కొనుగోలు చేసే అవకాశముంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు భారత్‌కు చెందిన విరాట్ కోహ్లీ రూ.15 కోట్లు, మహ్మాద్ సిరాజ్‌ను రూ.7 కోట్లుకు కొనుగోలు చేయగా, ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ రూ.11 కోట్లు చేసి కొనుగోలు చేసింది. ఈ జట్టుకు ఇంకా రూ.57 కోట్ల రూపాయిలు చేతిలో ఉంది.
కొత్తగా ఐపీఎల్ ప్రాంఛైజ్ తీసుకున్న గుజరాత్ (అహ్మదాబాద్ లయన్స్) జట్టు భారత్‌కు చెందిన హార్థిక్ పాండ్యా రూ.15 కోట్లు, గిల్ రూ.8 కోట్లుకు కొనుగోలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్‌ను రూ.15 కోట్లు చేసి కొనుగోలు చేశారు. ఈ జట్టుకు ఇంకా రూ.52 కోట్లు క్రీడాకారులు కొనుగోలుకే అందుబాటులో ఉంది.
లఖ్‌నవూ సూపర్ జైంట్స్ జట్టు భారత్‌కు చెందిన కె.ఎల్.రాహూల్‌ను రూ.17 కోట్లకు, రవీ భిష్ణాయ్ను రూ.నాలుగు కోట్లుకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన మార్కర్స్‌ను రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ జట్టుకు ఇంకా 59 కోట్లు చేతిలో ఉంది.
మిగిలిన క్రీడాకారుల వేలం కొనసాగుతోంది. తాజాగా జరుగుతున్న వేలంలో భారత్ జట్టుకు చెందిన శ్రేయస్స్ అయ్యర్‌ను రూ.12.25 కోట్లతో కోల్కత్తా కొనుగోలు చేసింది.
Also Read : ఇండియా క్లీన్‌స్వీప్