తమిళనాడులోని ఊటి దగ్గరలో కునూర్ ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సతీమణితో పాటు 13 మంది ప్రాణాలను కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో రావత్‌తో పాటు ఆయన భార్య, ఏడుగురు ఆర్మీ అధికారులు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఇందులో 11 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల గుర్తింపులు డిఎన్ఎ పరీక్ష ద్వారా నిర్ధారించడం జరుగుతుందని చెబుతున్నారు. అయితే మన దేశంలో ఇలా ప్రముఖులు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం కొత్త కాదు..గతంలో చనిపోయిన ప్రముఖుల విషయానికి వస్తే
లెఫ్టినెంట్ జనరల్ దౌలత్ సింగ్
1963 నవంబర్:1963 నవంబర్ 23న జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ ప్రాంతంలో భారత వైమానిక దళానికి చెందిన విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో లెఫ్టినెంట్ జనరల్ దౌలత్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ బిక్రమ్ సింగ్, ఎయిర్ వైస్ మార్షల్ ఎర్లిక్ పింటో మరణించారు.
మోహన్ కుమార మంగళం
మే 1973 : ఇనుము, ఉక్కు, గనుల శాఖా మాజీ మంత్రి మోహన్ కుమారమంగళం ఒక విమాన ప్రమాదంలో మరణించారు.
సంజయ్ గాంధీ
జూన్ 1980: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సంజయ్ గాంధీ విమాన ప్రమాదం వల్లే కన్ను మూశారు. నడుపుతున్న విమానం జూన్ 23, 1980న ఢిల్లీలో కూలి పోయింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు.
Also Read : హెలికాప్టర్ మృతుల్లో తెలుగు అధికారి, మదనపల్లిలో విషాదం
పంజాబ్ గవర్నర్ సురేంద్ర నాథ్
1994 : హిమాచల్ ప్రదేశ్‌లో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పంజాబ్ గవర్నర్ సురేంద్ర నాథ్, ఆయన కుటుంబానికి చెందిన తొమ్మిది మంది కన్నుమూశారు. సురేంద్ర నాథ్ అప్పట్లో హిమాచల్ ప్రదేశ్ యాక్టింగ్ గవర్నర్‌గా కూడా పని చేస్తున్నారు.
మాధవరావు సింధియా..
సెప్టెంబరు 2001: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా భోగావ్ తహసీల్ సమీపంలో మోటా వద్ద జరిగిన విమాన ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మాధవరావు సింధియా మరణించారు. పార్టీ సభలో పాల్గొనేందుకు సింధియా కాన్పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విమానంలో ఆయనతోపాటు మరో ఆరుగురు కూడా ఉన్నారు. అప్పట్లో మాధవరావు సింధియా కాంగ్రెస్ అగ్రనాయకులలో ఒకరిగా ఉండేవారు.
జీఎంసీ బాలయోగి..
మార్చి 2002 : ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో బెల్ 206 హెలికాప్టర్ కూలిపోవడంతో అప్పటి లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి మరణించారు.
Also Read : ఎంఐ- 17 హెలికాప్టర్ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇప్పుడు డిఫెన్స్ చీఫ్ ని..
ఓపీ జిందాల్..
ఏప్రిల్ 2005: ఫేమస్ స్టీల్ బ్యారన్, రాజకీయ నాయకుడు ఓపీ జిందాల్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈ ప్రమాదంలోనే హరియాణా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కుమారుడు సురీందర్ సింగ్, పైలట్ కూడా మరణించారు. చండీగఢ్ నుంచి ఢిల్లీ కి వస్తుండగా ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి..
సెప్టెంబర్ 2009 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2009 సెప్టెంబర్ 2న లో నల్లమల అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఆయన హెలికాప్టర్ క్యుములోనింబస్ మేఘాల కారణంగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనతోపాటు మరో నలుగురు మరణించారు.
దోర్జీ ఖండూ..
ఏప్రిల్ 2011: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తవాంగ్ నుంచి బయలుదేరిన 20 నిమిషాలకే ఆయన హెలికాప్టర్ అదృశ్యమైంది. నాలుగు రోజుల పాటు హెలికాప్టర్ ఆచూకీ దొరకలేదు. అయిదవ రోజున సెర్చ్ టీమ్‌లు హెలికాప్టర్ శకలాలు, అయిదుగురి మృతదేహాలను కనుగొన్నాయి.
Also Read : Bipin Rawat – సీడీఎస్ బిపిన్ రావత్ దుర్మరణం