గత ప్రభుత్వ హాయం లో టీడీపీ నేతల అక్రమాలకు సహకరించడం తో పాటు అవినీతి, చట్ట విరుద్ధమైన వ్యవహారాలు సాగించిన పోలిసులపై ఉన్నతాధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యం తో గాడితప్పిన ఖాకీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు గుంటూరు ఐజీ బ్రిజ్లాల్ దృష్టి సారించారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ చేయిస్తున్నారు. తాజాగా నేరం రుజువైన ఒక సీఐ, ఇద్దరు ఎస్ఐ సహా ఏడుగురిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులకు కొమ్ముకాసిన పోలీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.