హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 90 స్థానాలున్న హర్యానా లో పాలక బీజేపీకి 40 సీట్లు, కాంగ్రెస్ కు 31, జీజేఎం 10, ఐఇన్ఎల్డి కి 02, ఇతరులు 07 చోట్ల విజయం సాధించారు. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యులు అవసరం. మేజిక్ ఫిగర్‌కు 6 సీట్ల దూరంలో ఉన్న బిజెపి స్వతంత్రులు తో కలసి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు బీజేపీయేతర పార్టీలతో కలిసి 31సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. పది స్ధానాలు గెలుచుకున్న దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ కింగ్‌మేకర్‌గా మారింది.