మొన్నటివరకు టిఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన లైట్ గానే తీసుకునేవారు కెసిఆర్ కూడా విపక్షాల విమర్శలు లైట్‌గా తీసుకునేవారు. ఎక్కడా పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని గానీ కెసిఆర్ గానీ ఒక్క మాట అన్న తగ్గేదే లేదు అంటున్నారు.
మొన్న పంద్రాగస్టు రోజు మల్కాజిగిరిలో జరిగిన గొడవ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మైనంపల్లి హనుమంతరావు, నిన్న సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీపై నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న వరుస విమర్శలపై జీవన్ రెడ్డి, ఇప్పుడైతే తనపై అక్రమాస్తులు,కబ్జా ఆరోపణలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అయితే మల్లారెడ్డి మామూలుగా రెచ్చిపోలేదు. ప్రెస్ మీట్ జరుగుతున్నంతసేపు పూనకం వచ్చినట్లు రేవంత్ రెడ్డిపై శివతాండవం అడాడు మల్లారెడ్డి. ఒక అడుగు ముందుకేసి ప్రెస్ మీట్ లో అందరి ముందు తోడ కొట్టి రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్ విసిరారు నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ అబ్బో ఈ మాటలు రాయడానికి కూడా వీలుకాని బూతులు వాడాడు మల్లారెడ్డి. మంత్రి హోదాలో ఉన్న మల్లారెడ్డి పూనకం వచ్చిన వాడిలా రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్రంలో మిశ్రమ స్పందన వస్తుంది.
మొన్న జన ఆశీర్వాద సభ లో కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ ప్రభుత్వం పైన లైన్ దాటి విమర్శలు చేయడం కూడా విమర్శలకు దారి తీసింది. కేంద్ర మంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన కిషన్ రెడ్డి కూడా బండి సంజయ్ లాగా మారకూడదని టిఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హితవుపలికారు.
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్ అని కొందరు అంటుంటే ప్రతిపక్ష విమర్శలు కూడా హద్దులు దాటుతున్నందున టిఆర్ఎస్ పార్టీ వాళ్లు కూడా అదే స్థాయిలో సమాధానం ఇస్తున్నారని కొందరు అంటున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న టిఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా విపక్ష నాయకులు విమర్శలకు తీవ్రస్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో దీని వెనకాల ఏదో జరుగుతుందన్న విషయం అర్థమవుతుంది. అసలు విషయం ఏమిటంటే రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టిఆర్ఎస్ ను కెసిఆర్ ను విమర్శిస్తూ రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్నాయని అందుకే అసభ్య విమర్శలతో తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని భావించిన టిఆర్ఎస్ ఇకనుంచి విపక్షాల ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలని అధినేత నుంచి మొన్నటి పార్టీ మీటింగ్‌లో స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు సమాచారం.
ప్రతిపక్ష నేతలు కెసిఆర్ ను టిఆర్ఎస్ ను తీవ్రపదజాలంతో విమర్శిస్తున్న ప్రతిపక్షాలను ఇప్పుడు టిఆర్ఎస్ నేతలు కూడా అదే స్థాయిలో విమర్శించడం ప్రజలకు కొంత ఏహ్య భావాన్ని కలిగించిన ఎవరు తగ్గడం లేదు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కామన్ కానీ వ్యక్తిగతంగా ఏకవచనంతో వయస్సుకు పదవులకు గౌరవం ఇయ్యకుండా చేస్తున్న విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయాలపై ప్రజలకు జుగుప్స కలిగిస్తుంది. రాజకీయ పార్టీ నాయకులు కంట్రోల్ తప్పి మాట్లాడడంతో కార్యకర్తలు కూడా కంట్రోల్ తప్పి గ్రౌండ్లో ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకోవడంతో రాష్ట్రంలో రాజకీయమంటే బూతులు అడ్డాగా మారిందని ప్రజలు అనుకుంటున్నారు.
Also Read : తెలంగాణకు రెండో రాజధాని..?