ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ని దర్శించుకోవడానికి నేను నిల్చుని ఉన్న ఉచిత దర్శనం క్యూలో నా ముందు ఒక ముస్లిం వ్యక్తి కూడా నిల్చుని ఉన్నాడు.
నేనూ కొన్నిసార్లు నా ఇష్టంగా దర్గాలకు,చర్చిలకు వెళ్ళాను.
చాలా ఆనందం వేసేది.
అలాగే ఈరోజు హిందూ దేవాలయం లో ఒక ముస్లింని చూసినప్పుడు కూడా అంతే ఆనందం వేసి అతన్ని పలకరించి ఒక ఫొటో తీసుకున్నాను.
కొద్దిసేపు ఇష్టంగా మాట్లాడాను.
తనూ అంతే ఆప్యాయంగా మాట్లాడాడు.
తాను రెగ్యులర్ గా దర్గాలు,మజీదులతో పాటు హిందూ దేవాలయాలని కూడా దర్శించుకుంటాడట.
హిందూ ముస్లిములలొ ఉన్న కొంతమంది వెధవల వల్ల ఈ గొడవలు గానీ…. మతాలన్నీ మంచివే..
మంచీ చెడులన్నవి కేవలం మనుషుల్లో,మనుషుల బుద్దుల్లో ఉంటాయిగానీ మతాలన్నీ మంచివే..
మనదేశం మతాలుగా వేరైనప్పటికీ మనుషులుగా ఒక్కటే అనే ఆశాభావం తో,
మనుషులని బట్టి కాకుండా మతాలకనుగుణంగా కక్షలను పెంచుకునే వ్యక్తులలో ఎంతోకొంత కనువిప్పు కలుగొచ్చనే ఒక మంచి ఉద్దేశంతో మరియు అత్యాశతోనే ఈ చిన్ని ప్రయత్నం…..ఈ చిన్ని పోస్టు .
Happy Republic Day – TNR