చంద్రబాబుకు సిద్ధాంతం, విధానం లేదని.. చంద్రబాబుతో స్నేహం చేయాల్సిన అవసరం తమకు లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. ఏపీలో తమంతట తామే ఒక శక్తిగా ఎదగాలని చూస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికలలో తమ శక్తి ఏమిటో అందరికీ తెలుస్తుందని జీవీఎల్ పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ ఒంటరిగా సీఎం కాలేదని.. బీజేపీతో పొత్తు వల్ల చంద్రబాబు రెండుసార్లు సీఎం అయ్యారన్నారు. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వచ్చారని… లోక్సభ ఎంపీలతో తమకు అసలు అవసరమే లేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యమన్నారు. ఏపీపై దృష్టి పెట్టి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీకి అనేక సంస్థలు తెచ్చామన్నారు.