బాహుబలి తర్వాత ఆ స్థాయిలో దేశవ్యాప్తంగా యునానిమస్ రెస్పాన్స్ తెచ్చుకున్న సౌత్ సినిమా ఏదైనా ఉందంటే అది కెజిఎఫ్ మాత్రమే. వేల కోట్ల వసూళ్లు రాలేదు కానీ ఒక కన్నడ మూవీ ఈ స్థాయిలో సంచలనం సృష్టించడం మాత్రం శాండల్ వుడ్ హిస్టరీలో అదే మొదటిసారి. మొదటి రోజు యావరేజ్ ఓపెనింగ్స్ తో మొదలుపెట్టి వారం తిరిగేలోపు బ్లాక్ టికెట్ల స్థాయికి చేరుకోవడం అంటే మాటలా. అందుకే ఇప్పుడు అందరి కన్ను చాఫ్టర్ 2 మీద ఉంది. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 26 నుంచి బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో క్లైమాక్స్ చిత్రీకరణ మొదలుపెట్టనుంది. అది అయిపోతే గుమ్మడికాయ కొట్టడమే.
కానీ అసలు విలన్ సంజయ్ దత్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. సడక్ 2కి డబ్బింగ్ పూర్తి చేసి పూర్తి రెస్ట్ కు డిసైడ్ అయ్యాడు మరి అధీరా లేకుండా కెజిఎఫ్ చివరి ఘట్టంలో రాఖీ భాయ్ ఎవరితో ఫైట్ చేస్తాడనే అనుమానం రావడం సహజం. అయితే యూనిట్ ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు . ఈ చివరి షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ తో సహా కీలక తారాగణం మొత్తం పాల్గొనబోతున్నారు. ఒకవేళ సంజయ్ దత్ అవసరం లేకుండానే ఈ ఎపిసోడ్ ఉంటుందంటే 2021 సంక్రాంతికి కేజిఎఫ్ 2 ఖచ్చితంగా రావొచ్చు. అలా కాకుండా అతను ఉండాల్సిందే అనుకుంటే మాత్రం ఆ కొంత వర్క్ బాలన్స్ పెట్టేసి తర్వాత షూట్ చేసుకుంటారు. కానీ రిలీజ్ టార్గెట్ మిస్ అవుతుంది.
థియేటర్లు మూతబడి ఆరు నెలలు దాటుతున్న తరుణంలో కెజిఎఫ్ లాంటి భారీ చిత్రమైతేనే మునుపటి కళతో ప్రేక్షకులు హాళ్ల వైపు వస్తారని ట్రేడ్ నమ్మకంతో ఉంది. మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు ఎన్ని వచ్చినా ఇప్పట్లో హౌస్ ఫుల్స్ చూడటం జరగని పనే. అందుకే కెజిఎఫ్ 2 దీనికో పునాదిగా నిలవాలని కోరుకుంటున్నారు. బిజినెస్ వ్యవహారాలు కూడా వచ్చే నెలకంతా ఓ కొలిక్కి తేబోతున్నారు. సుమారు రెండు వందల కోట్లకు పైగా బిజినెస్ జరగబోతోందని ముందస్తు అంచనా. శాటిలైట్ డిజిటల్ మొత్తం కలుపుకుని చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ కావడం ఖాయమనే స్థాయిలో చర్చలు జరుగుతున్నాయట. లాక్ డౌన్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ ఎత్తున నష్టాలు చవి చూడటంతో ఎంతమేరకు ఫ్యాన్సీ ఆఫర్లతో వస్తారన్నది వేచి చూడాలి