ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలు, పంపిణి పై సీఎం జగన్ సంభందిత అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇసుక కొరత ఇబ్బందులు తొలగించేందుకు ఇసుక వారోత్సవాలు నిర్వహిద్దామని పేర్కొన్నారు. వారం రోజుల పాటు ఈ అంశం పై పని చేద్దామని అధికారులకు సూచించారు. ఇసుక బయట రాష్ట్రాలకు తరలి పోకుండా డిజిపి స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హాయంలో వ్యవస్థ అవినీతి మయమైందన్నారు. దాన్ని సరి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు రాబందుల్లా మనపై బండలు వేస్తున్నారని మండిపడ్డారు.