ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన కుటిల బుద్ధిని బయట పెట్టుకున్నారు. చాలా సునాయాసంగా అబద్ధాలు ఆడుతూ మాయ చేద్దాము అనుకునే ఆయన డీజీపీ ఫోన్ కాల్ విషయంలో దొరికేశారు. ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి టిడిపి జాతీయ కార్యాలయం మీద నిన్ను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద వ్యూహాత్మకంగానే టిడిపి కొంత మంది చేత అసభ్యకరమైన పదజాలంతో ప్రెస్ మీట్ లు పెట్టిస్తోంది. అధికారానికి దూరమయ్యామనే బాధ, వైయస్ జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో మళ్ళీ అధికారంలోకి రాగలమో లేదో అనే అనుమానంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఉదయం తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు విశాఖ జిల్లా పోలీసులు గంజాయి మీద చేసిన కామెంట్ లకు గాను నోటీసులు అందజేశారు.
నోటీసులు అందజేసిన దరిమిలా ఈ మధ్యకాలంలో టిడిపి తరఫున ఎక్కువగా ప్రెస్ మీట్ లకు మాత్రమే హాజరవుతున్న కొమ్మారెడ్డి పట్టాభిరాం అనే నయా నేత వైయస్ జగన్ సహా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహించే ఉద్యోగులందరినీ కించపరిచే విధంగా రాయలేని విధంగా అసభ్యమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు టిడిపి కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయిచుకున్నారు. అందులో భాగంగా మంగళగిరి పార్టీ ఆఫీసు విషయంలో జరిగిన గొడవ మీద చంద్రబాబు అప్పటికప్పుడు ప్రెస్మీట్ పెట్టి ఈ దాడులు స్టేట్ స్పాన్సర్డ్ ఎటాక్ అంటూ కొత్త టెర్మినాలజీతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. దీని వెనుక పోలీసుల సహాయసహకారాలు మాత్రమే కాక పూర్తి మద్దతు ఉందని తమ కార్యాలయం మీద అటాక్ జరగబోతుందని ఊహించి నేను డిజిపికి ఫోన్ చేస్తే డిజిపి ఫోన్ ఎత్తలేదు అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ విషయంలోనే చంద్రబాబు అబద్ధాలు మరోసారి వెల్లడయ్యాయి. ఇదే విషయం మీద తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక వివరాలు వెల్లడించారు.
Also Read : TDP Chandrababu – తన బాధ ప్రపంచం బాధ.. చంద్రబాబు నయా ట్రెండ్
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారిని దూషించకూడదన్న సవాంగ్, అలాంటి భాషను గతంలో ఎప్పుడూ వాడలేదన్నారు. అభ్యంతరకర పదాలను పదేపదే వాడారని, ఉద్దేశపూర్వకంగానే అలాంటి భాషను ఉపయోగించారను ఆయన పేర్కొన్నారు. ఇక చంద్రబాబు డీజీపీకి చేసిన ఫోన్ కాల్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. నిన్న తెలియని నెంబర్ నుంచి వాట్సప్ కాల్ వచ్చిందని, పరేడ్ గ్రౌండ్లో ఉన్న కారణంగా ఎవరు మాట్లాడుతున్నారో స్పష్టంగా వినిపించలేదన్నారు. తాను అసలు ఫోన్ ఎత్తలేదని అందుకే గవర్నర్ కు ఫిర్యాదు చేశానని చంద్రబాబే స్వయంగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
నిజమే మరి ఫోన్ ఎత్తక పోవడానికి ఎత్తి సరిగ్గా మాట్లాడలే కట్ చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిని అని చెప్పుకునే చంద్రబాబుకు ఆ మాత్రం క్లారిటీ లేదు అనుకోవడం మన పిచ్చితనమే. అసలు డీజీపీ ఫోన్ ఎత్తలేదు అని చెప్పిన ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశాను అని పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారాన్ని మరింత రక్తి కట్టించేందుకు తేదేపా తరపున రిలే నిరాహార దీక్షలు ప్లాన్ చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇదంతా కావాలనే చేస్తున్నట్టుగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Chandrababu – Amit Shah – దాడిపై ఫిర్యాదు చేస్తారు సరే.. అమిత్ షా కారణం అడిగితే ఏం చెబుతారు..?