ఒకప్పుడు ఏదైనా పాత సమాచారం కావాలంటే లైబ్రరీకి వెళ్లి పాత పత్రికలు పుస్తకాలు తిరగేస్తే కానీ పని జరిగేది కాదు. అది విజ్ఞానమైనా వినోదమైనా దేనికైనా ఇదొక్కటే మార్గం. కానీ ఇప్పుడలా కాదు. 4జి లాంటి టెక్నాలజీ వచ్చాక ఆన్ లైన్ సహాయంతో ఇన్ఫర్మేషన్ ని పట్టుకోవడం క్షణాల్లో పని. ఇందులో అందరూ ఎక్కువగా ఫాలో అయ్యేది వికీపీడియానే. అలా అని ఇందులో ఖచ్చితత్వం ఎంత ఉంటుంది అని ప్రశ్నిస్తే సమాధానం దొరకడం కష్టమే. ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ ఫార్మ్. ఎవరైనా తమకు తెలిసిన దగ్గరున్న డేటాని కానీ వాస్తవాలను కానీ ఏదైనా కానీ టెక్స్ట్ రూపంలో ఇందులో అప్ లోడ్ చేయవచ్చు. అలా అని గుడ్డిగా నమ్మడానికి లేదు.
ఇటీవల జరిగిన ఉదంతమే దానికి మంచి ఉదాహరణ. జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలనితో హీరోగా డెబ్యూ చేయడానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా రామాయణంలో నటించిన సంగతి తెలిసిందే. ఇది దర్శకుడు గుణశేఖర్ కి మంచి బ్రేక్ ఇచ్చిన మూడో సినిమా. అంతకు ముందు ఆయన లాఠీ, సొగసుచూడ తరమా చేశారు. రామాయణం 1997 సంవత్సరం ఏప్రిల్ 11 న విడుదలయ్యింది. కానీ వికీలో మాత్రం 1996 ఏప్రిల్ 14 అని పొందుపరిచారు. దీంతో అదే నిజమని నమ్మిన కొన్ని మీడియా సంస్థలు రామాయణం పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుందని దాన్ని ట్రెండ్ చేసి వ్యాసాలు విశేషాలు పెట్టేశాయి.
ఇదంతా చూసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత కన్ఫ్యూజన్ కు గురయ్యారు. గుణశేఖర్ కూడా పొరపాటున వికీలో డేట్ నే నమ్మేసి చెక్ చేసుకోకుండా ఈ సందర్భాన్ని ట్వీట్ చేసి ఆ తర్వాత తీసేసినట్టుగా నెటిజెన్లు చెబుతున్నారు. ఇక్కడ ఇచ్చిన ప్రూఫ్ చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. 1997 ఏప్రిల్ 11న వచ్చిన ఇంగ్లీష్ డైలీలో రామాయణం తాలూకు యాడ్ లో స్పష్టంగా రిలీజ్ టుడే అని ఇచ్చారు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో దేవి 70 ఎంఎం మెయిన్ థియేటర్ తో పాటు మిగిలిన లిస్టు కూడా ఇచ్చారు. కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు. ఇది దొరికింది కాబట్టి సరిపోయింది లేదంటే తప్పుడు తేదీ బలంగా జనంలోకి వెళ్ళేది