సినీ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అనారోగ్య కారణాలతో అపోలో హాస్పిటల్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్య కారణాలతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు అని తెలిసినప్పటినుంచి తెలుగు ప్రేక్షకులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అలనాటి నటులలో కైకాల సత్యనారాయణకు మంచి పేరు ఉంది. రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పనిచేసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయిపోయిన కైకాల సత్యనారాయణ సినిమాలను మాత్రం వదులుకో లేక ఏడాదికి ఒకటి అలా చేస్తూ వస్తున్నారు. అక్టోబరు నెలలో ఆయన ఇంట్లో జారిపోయి పడిపోవడంతో ఆయనకు గాయాలయ్యాయి. అప్పుడే హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు, ఆ తర్వాత ఆయన కోలుకోవడంతో ఇంటికి తీసుకు వచ్చారు..
అయితే కొద్ది రోజుల క్రితం ఆయనకు మరలా అస్వస్థత చోటు చేసుకోవడంతో హుటాహుటిన అపోలో హాస్పిటల్ కి తరలించారు. అప్పటి నుంచి కూడా ఆయన అపోలో హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నారు. ఆయన అనారోగ్యంతో ఉన్న కారణంగా వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారం జరుగుతున్నా సరే ఆయన కోలుకుంటున్నట్లుగా అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం చెబుతోంది. బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని వారు చెబుతున్నారు. ఈ విషయం మీద నిన్న ఒక వాయిస్ నోట్ కూడా కైకాల కుమార్తె విడుదల చేశారు. తాజా సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కైకాల సత్యనారాయణ కుమారుడు చినబాబుకు ఫోన్ చేసి కైకాల సత్యనారాయణ ఆరోగ్యం గురించి వాకబు చేశారు.
కైకాల ఆరోగ్యం మెరుగుపడుతుందని ధైర్యం చెప్పిన జగన్ ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కైకాల కుమారుడికి అభయం ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పేర్ని నాని అపోలో హాస్పిటల్ కి వెళ్లి కైకాల సత్యనారాయణ ని పరామర్శించడమే కాక కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.. మరోపక్క సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా కైకాల సత్యనారాయణ కుమారుడికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి టాలీవుడ్ సహా కన్నడ సినీ ప్రముఖులు కొంతమంది ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారని వెల్లడించారు.. అయితే తెలిసి తెలియకుండా మీడియాలో ఆయన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు మాత్రం రాయవద్దని కోరారు. కైకాల స్వగ్రామం కృష్ణ జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని కౌతవరం గ్రామం.
Also Read : Kaikala Satyanarayana : మా కాలపు మహావిలన్ “కైకాల”