రెండు రోజుల పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.
ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం జగన్ ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో చర్చించనున్నారు. విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదం, ప్రాజెక్టులో ఖర్చు చేసిన నిధుల రీయంబర్స్మెంట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు సహా పలు అంశాలను సీఎం జగన్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ప్రధాని మోదీతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు. ఆర్థికపరమైన అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించనున్నారు. రేపు మంగళవారం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన జాతీయ రహదారుల పూర్తి, నూతన ప్రతిపాదనలను మంత్రి దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి రాష్ట్రానికి వస్తారు.
Also Read : జగన్ బాటలో తెలంగాణ సర్కార్.. ఆ నోళ్లన్నీ ఇప్పుడేమంటాయో?