ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సహా.. పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాత్రికి ఢిల్లీలో బస చేయనున్నారు.
బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు.