హాయిగా… సాఫిగా వెళ్తున్న ప్రయాణం లో మన కంటే ముందు వెళ్లిన వాహనం పెద్ద ఆక్సిడెంట్ చేస్తే ఏమవుతుంది?? మన ప్రయాణానికి సైతం ఆటంకం కలుగుతుంది.. వెళ్లే గమ్యం ఆలస్యమవుతుంది.. ముందు యాక్సిడెంట్ అయిన వాహనాన్ని పక్కకు తప్పించి మళ్లీ రోడ్డును క్లియర్ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.. కచ్చితంగా దీనికి సమయం పడుతుంది. హైరానా పడి ప్రమాదం జరిగిన వాహనంపై నుంచి వెళ్లడం ఎవరికీ ఐనా అసాధ్యమే.. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక సరఫరా విషయంలో జరిగింది ఇదే… గత ప్రభుత్వం ఇష్టానుసారం చేసిన ఇసుక దోపిడీకు ప్రత్యామ్నాయంగా… పారదర్శకంగా ఇసుక అందరికీ అందేలా చర్యలు తీసుకోవడంలో కాస్త ఆలస్యం జరిగిన మాట వాస్తవమే. ఇష్టానుసారం ఇసుకను కాజేసి ఇసుక ద్వారా కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ విధానాలను మళ్ళీ గాడిలో పెట్టడానికి ప్రభుత్వం చేసిన ప్రయోగాలు ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి. క్రమంగా ఇసుక విషయంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా… అది కూడా అవసరాలకు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం వ్యవస్థను గాడిలో పెట్టింది.
టీడీపీ నాయకులకు ఇసుక పండగ!
గత ప్రభుత్వ హయాంలో ఇసుక రీచ్ లన్నీ టిడిపి నేతల చేతుల్లో ఉండేవి. దీంతో వారు ఎవరికి కావాలంటే వారికి ఇసుక సరఫరా చేసేవారు. ముఖ్యంగా జన్మభూమి కమిటీలు ఇసుక విషయంలో చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. గ్రామాల్లో ఎవరైనా కొత్త కట్టడం కట్టుకోవాలంటే జన్మభూమి కమిటీ సభ్యులను సంప్రదించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇసుక బుకింగ్ కు సరఫరాకు నిర్దిష్టమైన విధానం లేకపోవడం టిడిపి నేతలకు అప్పట్లో వరం అయింది. ఒక క్రమ పద్దతి లేకుండా ఇసుక సరఫరాను చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండి ఏర్పడటంతో పాటు… ఇటు వినియోగదారులు భారీగా నష్టపోయే వారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అమ్ముకొని కోట్లు గడించిన వా టిడిపి నాయకులు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా నాయకుల అనుచరులు ఇసుక రీచ్ లను తమ ఆధీనంలోకి తీసుకొని… తమ సొంత వాహనాల ద్వారా వినియోగదారులకు సరఫరా చేసి అందినకాడికి దోచుకునేవారు. ఈ విషయం టిడిపి ప్రభుత్వానికి అప్పట్లో అప్రతిష్టపాలు చేసింది. మళ్లీ ఇప్పుడు ఇసుక విషయంలో అలాంటి అనైతిక విధానానికి మంగళం పాడుతూ పారదర్శకంగా ఇసుకను వినియోగదారులకు అందించాలనే తలంపుతో జగన్ ప్రభుత్వం వచ్చీరాగానే ఇసుక పాలసీ మీద పక్కా చర్యలు తీసుకుంది.
మెల్లగా గాడిలో పడినట్లే!
ఇసుక పాలసీను సరిచేసేందుకు జగన్ ప్రభుత్వం కొన్ని ప్రయోగాలు చేసింది. ఆన్లైన్ ఇసుక విధానం, గ్రామాల్లో రీచ్ల విధానం, రెవెన్యూ అధికారుల దగ్గరనుంచి అనుమతి తీసుకునే విధానం లాంటి విధానాలు అమలు చేసింది. తర్వాత సైతం ఇసుక సరఫరా విషయంలో సరైన పారదర్శకత కనిపించకపోవడంతో కొత్త విధానాలను రూపొందించే, బాధ్యతను తీసుకుంది. మధ్యలో నదులకు వరదలు పోటెత్తడంతో పాటు ఇసుకను తీసే మార్గం లేక పోవడం కూడా కొరతకు కారణమైంది. అయితే క్రమంగా నదీపరివాహక ప్రాంతాల్లో ఇసుక లభ్యత పెరగడంతోపాటు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానం సైతం ఇసుక సరఫరాను మెరుగు పరిచింది.
గతం కంటే మెరుగు!
ఇసుక సరఫరా విధానంలో ఇటీవల జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు ఇప్పుడిప్పుడే ఫలితాలు చూపుతున్నాయి. కొన్ని ఏజెన్సీలు ఇసుక రీచ్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించడం వాళ్ళ వినియోగదారులు అవసరం అయితే డైరెక్ట్ గా రీచ్ వద్దకు వెళ్లి తమకు ఎంత మేర ఇసుక అవసరం అవుతుందో అంత మేర దానికి బిల్లులు చెల్లించి… ఇసుకను పొందవచ్చు. ఇదంతా ఆధార్ కార్డు సహాయం తో పాటు నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో పరిశీలించి అక్కడ ఇసుకను తరలిస్తారు. ఇసుక నల్ల మార్కెట్ కు కదలకుండా చూసే బాధ్యత రెవెన్యూ అధికారుల ది. దీనిలో ఎక్కడ ప్రభుత్వ అధికారుల అజమాయిషీ ఉండదు. అయితే పర్యవేక్షణ మాత్రం ఉంటుంది. దీంతో వినియోగదారులకు మధ్యవర్తి అవసరం లేకుండా పోయింది. దింతో గతంకంటే ప్రస్తుత విధానం మీద ప్రజల్లో ఒక సానుకూలమైన అభిప్రాయం వ్యక్తం అవుతుంది.