ఒక రౌడీకి తన ఇమేజ్ కాపాడుకోవడం పెద్ద విషయం. ఇక రాజకీయాల్లో సైతం రెబల్ గా ముద్రపడిన వ్యక్తి తన ఇమేజ్ కాపాడుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో ఆఫీస్ బేరర్ దగ్గర కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా… రెబల్ మార్క్ ఎమ్మెల్యే గా ముద్రపడిన చింతమనేనికి ఇప్పుడు ఈ భయం పట్టుకుంది. తన రెబల్ మార్కు ఎక్కడ పోతుందో? రోజురోజుకు దగ్గర వారు తన సహచరుల వద్ద చులకన అవుతున్నాం అన్న భావం ఆయనలో కలుగుతుంది. ఇది సంక్రాంతి పండుగ తర్వాత నుంచి మరింత ఎక్కువైంది. ఆయనను ఎప్పుడూ పలకరించేవారు… ఆయనంటే ఓ రెబల్ గా ముద్రపడిన వ్యక్తులు సైతం ఆయనను చాలా లైట్ తీసుకోవడం ఇప్పుడు ఆయన అభద్రతాభావాన్ని మరింత ఎక్కువ చేస్తోంది.
పందేలు దగ్గర నుంచి!
పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పెద్ద పండుగకు సైతం సంక్రాంతి కోడిపందాలు గోదావరి జిల్లాలో జరిగాయి. అయితే చింతమనేని ప్రభాకర్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దెందులూరు నియోజకవర్గంలో మాత్రం అంతగా సాగలేదు. అందులోనూ చింతమనేని సొంత గ్రామమైన దుగ్గిరాలలో ఈసారి కోడిపందాలను పోలీసులు పూర్తిగా కట్టడి చేశారు. భారీగా తరలి వచ్చే వీవీఐపీలు వీఐపీలు రాక ఈసారి దుగ్గిరాల లో కనిపించలేదు. చింతమనేని ఎప్పుడూ తన సొంత స్థలాల్లో గీసే బరి ఈసారి కనిపించలేదు. దీనంతటికీ పోలీసులు పక్కాగా చింతమనేని కి గట్టి హెచ్చరికలు పంపడమే కారణం. ప్రతి ఏటా చింతమనేని నమ్ముకొని గోదావరి జిల్లాలకు వచ్చే ఆయన అనుచర వర్గం, ఆయనకు కావలసినవారు ఈసారి పండగకు గోదావరి జిల్లాలకు వచ్చే సాహసం చేయలేకపోయారు. మరోపక్క చింతమనేని ప్రభాకర్ సైతం వారికి తగిన భరోసాను ఇవ్వలేకపోయారు. వస్తే ఎక్కడ పోలీసులతో లేనిపోని తలనొప్పులు కొన్ని తెచ్చుకోవాలి అన్న భయంతో చాలామంది పందాలకు రాకపోవడం… అది చింతమనేనికి ప్రతికూలంగా మారడం దీంతో ఆయన సన్నిహితుల వద్ద మదన పడటం ఇప్పుడు కనిపిస్తుంది.
చాలామంది దూరంగా!
చింతమనేని కోడిపందాలు బరిలో దగ్గరకు ఆయన సన్నిహితులు దగ్గర వారే కాకుండా హైదరాబాద్ నుంచి వివిఐపిలు ఆయన వద్దకు వస్తారు. దీనికి చింతమనేని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాల్లో చింతమనేనికి సహాయపడే వారు వారిలో ఎక్కువ మంది కనిపిస్తారు. ఏడాదిలో మూడు రోజుల పాటు చింతమనేని ఇలాకాలో వారు ఆడిందే ఆటగా సాగుతుంది. అయితే ఈసారి కోడిపందాల్లో చింతమనేని పూర్తిగా వెనుకంజ వేయడంతో పాటు పోలీసులు దగ్గర నుంచి కూడా హెచ్చరికలు రావడంతో… సంక్రాంతికి చింతమనేని సైలెంట్ అయిపోయారు. ఇది ఆయనకు ఇప్పుడు తలవంపులు తెచ్చిపెడుతోంది.
కనీసం పోలీసుల్ని మేనేజ్ చేసి మూడు రోజులపాటు పందాల నిర్వహించలేని వ్యక్తిగా చింతమనేని దగ్గర వారి దగ్గర ఇప్పుడు నానా రకాల మాటలు పడుతున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. చిన్న చిన్న విషయాలను సైతం మేనేజ్ చేయలేక కేవలం టిడిపి హయాంలోనే సత్తా చూపించే నాయకుడిగా ఆయన పలువురు వ్యాఖ్యానించడం… దానికి చింతమనేని నోచ్చుకోవడం… తన అనుకున్న వారిని కనీసం పలకరించలేదు పరిస్థితిలోకి చింతమనేని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ తన పాత ఇమేజ్ ను ఎలా కాపాడుకోవాలి దాన్ని ఎలా తెచ్చుకోవాలి అన్నదాని మీదే ఆయన తీవ్రంగా మదనపడుతున్నారు.