సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మంగళవారం విజయవాడ లో సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసారు. కాల్ లెటర్ లు పంపి , సర్టిఫికెట్ పరిశీలన తర్వాత ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు. హార్టికల్చర్ ఉద్యోగానికి తాము ఎంపికయ్యామని, ప్రక్రియ అంతా పూర్తి ఐన తర్వాత డిగ్రీ లో బిజెడ్ సి చదివిన వారు అనర్హులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.