మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 28న రాజధానిలో చంద్రబాబు పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు మీడియా ముందుకువచ్చి చంద్రబాబు పై మండిపడ్డారు, రాజధాని పేరు చెప్పి రైతులు దగ్గర 33వేల ఎకరాలు సేకరించి ఒక్క ఇటుక కూడా వెయ్యకుండా 5 ఏళ్ళు గ్రాఫిక్ బొమ్మలు చూపారని , ఒక్క ఎకరా భూమి కూడా ఏ తెలుగుదేశం నాయకుడు రాజధానికి ఇవ్వకపోగా తెలుగుదేశం నాయకులంతా కలిసి రైతులని మోసం చేసి రాజధాని ప్రాంతంలో సుమారు 9వేల ఎకరాలు కొన్నారని రాజధానిలో అడుగుపెట్టేముందు రైతులుకు చంద్రబాబు క్షమాపణ చెప్పి అప్పుడు రావాలని డిమాండ్ చేశారు.
రైతులను దగా చేశారు
రైతులు అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే మూడు ఏళ్ళలొ ఫ్లాట్లను అభివృద్ది చేస్తాను అన్నారు ఎందుకు చేయలేదొ, ఇచ్చిన ఫ్లాట్లలొ 25 లక్షల గజాలు ఎందుకు హొల్డ్ లో పెట్టారో, అసైండ్ భూములను ఎందుకు తక్కువ ప్యాకేజీకి ఇచ్చారో ముందు ప్రజలకు చెప్పి, మోసం చెసినందుకు క్షమాపణలు చెప్పి అప్పుడు రాజధాని ప్రాంతం ని సందర్సించాలి అని డిమాండ్ చేశారు.
చంద్రబాబు రాజధాని ప్రాంతం లొ ఇన్సైడర్ ట్రేడింగ్ కి పాల్పడ్డారు అని, 5 ఏళ్ళు గ్రాఫిక్ బొమ్మలు చూపిస్తూ ఒక్క శాశ్వత నిర్మాణంకి కూడా పునాది వెయ్యలేకపొయ్యారని రాజధానిని తమకి అనుకూల పత్రికలలో తప్ప ప్రజలకు ఏనాడు కనిపించలేదు అని అనేక ఆరోపణలు ఉన్న సందర్భంలో ఇప్పుడు రాజధాని రైతుల నుండే ఇలా ప్రశ్నలు రావటం చంద్రబాబుకి మింగుడు పడని విషయం. రాజధాని రైతుల ప్రశ్నలకు చంద్రబాబు ఏవిధంగా జవాబు ఇస్తారో చూడాలి…