4-1-7-6… ఆస్ట్రేలియా జట్టుకు చెందిన బోలాండ్ బౌలింగ్ గణాంకం. ఇది చూస్తే తెలుస్తోంది ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంత ఘోరంగా వైఫల్యమైంది అని చెప్పుకోవడానికి. నలుగురు బ్యాట్స్మెన్లు సున్నాకే ఔటయ్యారంటే తెలుస్తోంది ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంత బలహీనంగా ఉందో. 7/1, 7/2, 22/3, 22/4, 60/6, 61/7, 65/8, 65/9 ఇలా ఇంగ్లాండ్ వికెట్లు పతనమైన తీరును బట్టి తెలుస్తోంది ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ పేకమేడలా ఎలా కుప్పకూలింది అనేది. యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్ జట్టు తొలి నుంచి కొనసాగుతున్న వైఫల్యం మూడవ టెస్టులోను కొనసాగింది. దీనితో యాషెస్ సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. వరుసగా మూడు టెస్టులను గెలుచుకుని సునాయాసంగ సిరీస్‌ను వశపరుచుకుంది. ఇంకా రెండు టెస్టులు ఉండగానే 3-0 తేడాతో టెస్టు సిరీస్ గెలవడం విశేషం.
రెండవ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫేస్ బౌలర్ బోలాన్డ్ దెబ్బకు విలవిలలాడారు. అతని ఫేస్ ధాటికి ఇంగ్లాండ్ జట్టు దాసోహమైంది. కేవలం నాలుగు ఓవర్లలో ఏడు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ జట్టు పేకమేడలా కూలిపోయింది. ఏకంగా నలుగురు బ్యాట్స్మెన్లు సున్నా పరుగులకే పెవిలియన్ చేరడం గమనార్హం.మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న మూడవ టెస్టులో ఘోరమైన బ్యాటింగ్ వైఫల్యంతో ఇంగ్లాండ్ జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఆల్ఔట్ అయ్యింది.
31 పరుగులకు నాలుగు వికెట్ల ఓవర్ నైట్ స్కోర్‌తో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టులో రూట్, స్టోక్‌లు మూడు, నాలుగు ఫోర్లు సాధించారు. తరువాత ఇంగ్లాండ్ జట్టు కష్టాలు మొదలయ్యాయి. ఫేస్ బౌలర్ బోలాన్డ్ ధాటికి ఇంగ్లాండ్ జట్టు చేతులు ఎత్తేసింది. రూట్ 28 పరుగుల వద్ద, స్టోక్స్ 11 పరుగులు వద్ద ఔట్ కావడంతో ఇంగ్లాండ్ పతనం ఆరంభమైంది.బోలాన్డ్ స్వింగ్ బాల్‌కు బెన్ స్టోక్ ఔటయిన తీరు అతనికే ఆశ్చర్యానికి గురి చేసింది. జట్టులో మలాన్తోపాటు లీచ్, ఉడ్, రాబిన్సన్లు సున్నా పరుగులకే ఔటయ్యారు. బారిస్టో ఐదు, బట్లర్ ఐదు (నాటౌట్), అండర్సన్ 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. అసీస్ మూడవ టెస్టునే కాకుండా యాషెస్ సిరీస్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌లో బోలాన్డ్ తో పాటు స్ట్రాక్కు మూడు, గ్రీన్‌కు ఒక వికెట్ చొప్పున వచ్చింది.
ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ దిశగా:
యాషెస్ సిరీస్‌ను ఇప్పటికే గెలుచుకున్న ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ జట్టుపై సంపూర్ణ ఆధిక్యం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఐదు టెస్టులను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. యాషెస్‌లో ఐదు టెస్టులను క్లీన్ స్వీప్ అయ్యింది మూడుసార్లు మాత్రమే. ఆ మూడసార్లు కూడా ఆస్ట్రేలియా సాధించడం విశేషం. తొలిసారి 1920-21, తరువాత 2006-07 తిరిగి 2013-14లో ఆస్ట్రేలియా 5`0తో సిరీస్ గెలుచుకుంది. 1978-79లలో ఇంగ్లాండ్ జట్టు ఐదు టెస్టులు గెలిచినా నాటి సిరీస్ ఆరు టెస్టులకు నిర్వహించడం విశేషం. ఈ సిరీస్‌ను ఇంగ్లాండ్ జట్టు 5-1 తేడాతో కైవసం చేసుకుంది.
Also Read : ఇంగ్లాండ్… ఎదురొడ్డి నిలుస్తుందా? దాసోహమా?