జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది గడుస్తుంది. ఈ ఏడాదిలో జగన్ గారి ప్రభుత్వం అమలు చేసినన్ని సంక్ష్రేమ పధకాలు ఈ దేశంలో మరో ముఖ్యమంత్రి అమలు చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆఖరికి దేశం అంతా లాక్ డౌన్ తో సంక్షోభంలో కూరుకుపోయినా, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ అమలు చేసే సంక్షేమ పధకాలకు బ్రేకులు వేయలేదు. ఇలా ప్రజా సంక్షేమమే దేయ్యంగా పాలన సాగిస్తున్న జగన్ గారిపై ప్రతిపక్షాలు నిత్యం ఏదోఒక నిరాదారమైన ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా వాటిని ప్రచారం చేస్తు జగన్ పై ప్రజల్లో లేని వ్యతిరేకతను ఉందని చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా గడచిన ఈ ఏడాది లో జగన్ పై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలలో అధిక భాగం మతాలను రెచ్చగొట్టేవే ఉండటం గమనార్హం .
గడిచిన ఏడాదిగా జగన్ ను హైందవ సమాజానికి దూరం చేయాలని లేని పోని అభూతకల్పనలను సృష్టించి పనికట్టుకుని చేసిన విషప్రచారం చూస్తే ప్రతిపక్షాలు రాజకీయం కోసం ఎంత మతోన్మాధం సృష్టించటానికి కూడా వెనకాడటంలేదనే విషయం అర్ధం అవుతుంది. విజయవాడ భవానీ ద్వీపం దగ్గర తెలుగుదేశం నిర్మించిన మేరీమాత విగ్రహాన్ని పట్టుకుని ఏకంగా బి.జే.పి రాష్ట్ర అధ్యక్షులే జగన్ కి అంటగట్టే ప్రయత్నం చేయడం దగ్గర నుండి, బస్సు టికెట్లు పై మత ప్రచారం అన్నారు, తిరుమల లో వాచ్ హౌస్ లో టవర్ ను చూపి తిరుమల కొండ పై శిలువ అన్నారు, రేషన్ కార్డులపై ఏసు బొమ్మలు అన్నారు, టి.టి.డి సైట్ లో ఉండే పుస్తకం లో ఏసు ప్రస్తావన అన్నారు, తిరుమల , శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు అన్నారు, గుంటూరు గ్రామ సచివాలయంలో మత ప్రచారం అన్నారు, గుంటూరు లో గుడులని కూలగొట్టారు అన్నారు. ఇలా అనేక విషప్రచారాలను పుంఖాను పుంఖాలుగా పుట్టిస్తూ జగన్ పై మతతత్వ దాడిని తీవ్రతరం చేశాయి ప్రతిపక్షాలు.
ఇక తాజాగా మరో సారి అదే పందాలో మరో ఆరోపణకు తెరలేపారు. జగన్ తిరుమల వేంకటేశ్వర స్వామి ఆస్తులను వేలం వేస్తున్నారు అని సోషల్ మిడీయా మాద్యమాల్లో , తెలుగుదేశం అనుబంధ పత్రికల్లో , మీడియా చానల్స్ లో తీవ్రమైన ప్రచారం మొదలు పెట్టారు. బిజేపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా యదావిదిగా ఈ విషయానికి జగన్ ని భాద్యుడిని చేస్తు ఒక సందేశం కూడా పంపించారు. కానీ ఈ ప్రచారం లో ఉన్న నిజనిజాలు చూస్తే జగన్ పై మతతత్వ దాడి చేయడానికి వీరు ఏరకంగా ఉవ్విల్లూరుతున్నారో అర్ధం అవుతుంది
తిరుమల భూముల వేలం వెనక ఉన్న వాస్తవాలు:-
నిజానికి ఈ దేవస్థానం నిరర్థక ఆస్తుల అమ్మక ప్రక్రియ అనేది ఈ రోజు జగన్ ప్రభుత్వం తెచ్చినది కాదు, 1974 నుండి జరుగుతున్న ప్రక్రియే. ఈ రకంగా నిరర్థక ఆస్తుల అమ్మకం 2014 వరకు చూస్తే, 129 ఆస్తులను బహిరంగ వేలము ద్వారా విక్రయించడం జరిగింది. ఇదే క్రమంలో చంద్రబాబు హయంలోనే శ్రీ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షులుగా గల పాలకమండలి 2015 జులై 28న, తీర్మానం నంబరు 84 మేరకు టిటిడికి ఏరకంగాను ఉపయోగపడని ఆస్తులను గుర్తించి బహిరంగ వేలము ద్వారా వాటిని విక్రయించడానికి గల అవకాశాలను పరిశీలించడానికి సబ్ కమిటీని నియమించింది. ఈ సబ్ కమిటీలో అప్పటి పాలక మండలి సభ్యులు శ్రీ జి.భాను ప్రకాష్‌రెడ్డి, శ్రీ జె.శేఖర్, శ్రీ డి.పి.అనంత, శ్రీమతి ఎల్లా సుచరిత, శ్రీ సండ్ర వెంకట వీరయ్య లను ఈ సబ్ కమిటీలో సభ్యులుగా నియమించారు.
2016 జనవరి 30న సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు, తీర్మానం నెం. 253 ద్వారా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో సబ్ కమిటీ గుర్తించిన 50 నిరర్థక ఆస్తులను బహిరంగ వేలము ద్వారా విక్రయించడానికి శ్రీ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్యక్షతన గల పాలక మండలి ఆమోదం కూడా తెలిపింది. ఈ తీర్మానం మేరకు దేవస్థానం సిబ్బంది ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాలలో గల 17 ఆస్తులు, పట్టణ ప్రాంతాలలోని 9 ఆస్తులు, తమిళనాడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 23 ఆస్తులకు సంబంధించి సబ్‌రిజిస్టార్ కార్యాలయాల రికార్డులలోని విలువ, బహిరంగ మార్కెట్ విలువలను సేకరించి పాలకమండలికి నివేదించడం జరిగింది. ఒక ఆస్తికి సంబంధించి కోర్టు కేసు ఉండటంతో వేలం ప్రక్రియ నుంచి మినహాయించడం జరిగింది. అలాగే రుషికేష్‌లో ఒక ఎకరా 20 సెంట్ల భూమి వల్ల టిటిడికి ఎలాంటి ఉపయోగం లేకుండా అక్రమణకు గురయ్యే ప్రమాదం ఉండటంతో దీన్ని కూడా వేలం జాబితాలో చేర్చడం జరిగింది.
చంద్రబాబు హయాంలో శ్రీ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్యక్షతన ఇచ్చిన తీర్మానం మేరకు 50 నిరర్థక ఆస్తుల విలువను రూ. 23.92 కోట్లుగా ప్రస్తుత పాలక మండలి తీర్మానం నెం.309 తేదీ 29-02-2020 ద్వారా ధర నిర్ణయిస్తూ, గత పాలక మండలి నిర్ణయాలను అమలు చేయదానికి ఆమోదం మాత్రమే తెలపడం జరిగింది
అదే సమయం లో 2003 లో గుండాల కృష్ణా రెడ్డి అనే అతను నిరర్ధక ఆస్తుల అమ్మే విషయంలో ఒక ప్రాపర్టీ మీద టిటిడి పైన కేస్ వేస్తే, టిటిడి 1951 మద్రాస్ ప్రెసిడెన్సీ లో పాస్ చేసిన ఎండోమెంట్స్ ఆక్ట్ కింద ఏర్పడి, తర్వాత రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ ఆక్ట్ కిందకి వచ్చి మరే హిందు ధార్మిక సంస్థకు వర్తించని సదుపాయాలతో టిటిడి ఏర్పడ్డది. అలాగే 1987 లో సవరించిన ఎండోమెంట్స్ ఆక్ట్ లో కూడా టిటిడి కి ప్రత్యేక అధికారాలు కలిగి ఉన్నది. ఆ అధికారాల ఆధారంగా గుండాల కృష్ణ రెడ్డి కేస్ ను కొట్టేశారు. మళ్ళీ 2010 లో ఇలాగే నిరర్ధక ఆస్తుల అమ్మే విషయంలో ఎస్వీ డైరీ కి సంబంధించిన నిరర్ధక ఆస్తుల విక్రయం మీద కోర్ట్ కు పోతే 2003 గుండాల కృష్ణ రెడ్డి కేస్ ను ఉదాహరణ గా తీసుకుని, టిటిడి చేస్తున్నది చట్టానికి లోబడే అని కోర్టు ఆ కేస్ కొట్టేసింది.
చట్ట ప్రకారం ఎప్పటినుండో అన్ని ప్రభుత్వాలు చేస్తున్న పని , పైగా చంద్రబాబు హయాంలో ఏర్పడిన పాలక మండలి చెసిన తీర్మాణం ని అమలు చేయడానికి దేవస్థానం బోర్డు నిర్ణయం తీసుకుంటే ఒక వర్గం మీడియా , వారి పార్టీ కార్యకర్తలు ప్రస్తుత ప్రభుత్వం పై ఎప్పటిలాగే దేవుడిని సైతం అడ్డు పెట్టుకుని బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఈ భూముల వేలం విషయంలో గత పాలక మండలి ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో కీలక పాత్ర పోషించిన భానుప్రకాష్ రెడ్డి నేడు తాను చేసిన పనిని ముఖ్యమంత్రి జగన్ కు అంటగట్టే ప్రయత్నం చేయడం చూస్తే ఒక ప్రణాలికా బద్దంగా ప్రతిపక్షాలు అన్ని కలిసి జగన్ పై మతతత్వ దాడి ని ఎంత తీవ్రతరం చేశాయో అర్ధం చేసుకోవచ్చు. యావత దేశంలో జగన్ లా ఇలా కుట్ర పూర్తిత మతతత్వ దాడిని ఎదుర్కుంటున్న నేత మరోకరు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో .