కొత్త పథకం, పాత పథకం అమలు చేసే రోజు, తర్వాత రోజు ఆంధ్రజ్యోతి సదరు పథకంపై, వైసీపీ ప్రభుత్వం అక్షర విషం చిమ్మడం కొనసాగిస్తోంది. తనకు నిచ్చిన రాతలు రాస్తూ పథకం గొప్పతనాన్ని తగ్గించడమో, లేదా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా కట్టుకథలు రాయడమో చేస్తోంది. తాజాగా మూడో ఏడాది అమలు చేసిన వైఎస్సార్ వాహన మిత్ర పథకంపై కూడా ఆంధ్రజ్యోతి విషం చిమ్మింది. వాహన మిత్రకు నవగండం శీర్షికన ఈ రోజు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి.. నవరత్న పథకాల్లో ఏదైనా ఒక్క పథకం ద్వారా లబ్ధి పొందినా.. వాహన మిత్ర పథకం వర్తింపజేయడంలేదంటూ కట్టుకథలు రాసింది.
అక్కసుతో కట్టుకథలు..
ఆటో డ్రైవర్ భార్యకు అమ్మ ఒడి వచ్చినా.. తల్లికి పింఛన్ వచ్చినా.. వాహన మిత్ర పథకం నిలిపివేశారంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. ఈ ఏడాది ఈ తరహాలో కొత్త నిబంధనను అమలు చేశారంటూ అవాస్తవాలు ఆ కథనంలో పొందుపరిచింది. అమ్మ ఒడి, పింఛన్, వైఎస్సార్ ఆసరా.. ఏ పథకమైనా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అర్హత ఆధారంగా వర్తింపజేస్తున్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ వలంటీర్ల ద్వారా జగన్ ప్రభుత్వం పథకాలు అందిస్తోంది. వాహన మిత్ర కూడా ఎలాంటి షరతులు, నవరత్న పథకాలతో సంబంధం లేకుండా అర్హత ఆధారంగా అమలు చేసింది. అయితే ఇందుకు భిన్నంగా ఆంధ్రజ్యోతి అవాస్తవాలతో కథనం రాసి జగన్ ప్రభుత్వంపై తన అక్కసును మరోసారి వెల్లగక్కింది.
సీఎం ఏం చెబుతున్నారు…
తన ప్రభుత్వం మంచి చేసినా.. బురదజల్లుతారనే సీఎం వైఎస్ జగన్.. తానే ప్రతి పథకం అర్హతలు, అమలు, దరఖాస్తు విధానాన్ని వివరిస్తున్నారు. వాహన మిత్ర పథకం మూడో విడత నగదు జమ చేసి మంగళవారం నాడు కూడా.. సీఎం జగన్ ఆయా విషయాలను మరోసారి గుర్తు చేశారు. ముఖ్యంగా అర్హత ఉండి.. పథకం అందని వారంటూ ఎవరూ ఉండకూడదనేదే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఇంకా అర్హత ఉన్న వారు ఎవరైనా ఉంటే 30 రోజుల్లో సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమైనా ఫిర్యాదులు, సందేహాలు ఉంటే 1902 టోల్ ప్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని సీఎం వైఎస్ జగన్ నేరుగా ఆటో, ట్యాక్సీవాలాలకు సూచించారు. ఇంత పక్కా.. సంతృప్త స్థాయిలో పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్నా.. ఆంధ్రజ్యోతి, టీడీపీ నేతలు మాత్రం విషం చిమ్మడం మాత్రం ఆపడం లేదు.
Also Read : జగన్ పాలనకు 100 మార్కులు తెచ్చిపెట్టిన 30 రోజుల నిబంధన