అనంతపురం నుంచి అమరావతికి ఒక్క వంపు కూడా లేకుండా హైవే ను నిర్మిస్తామని 2015లో చంద్రబాబు ప్రకటించాడు. ఆమార్గంలో కొన్నిచోట్ల సర్వే కూడా చేశారు కానీ నిధులకు సంబంధించి కేంద్రాన్ని ఒప్పించలేకపోయారు.చంద్రబాబు హయాంలో మాటలెక్కువ తప్ప చేతలు తక్కువున్న ఆరోపణలను నిజం చేస్తూ ఆ రహదారి పని మొదలు కాలేదు.ప్రాజెక్టులను ప్రకటించి తన్మయత్వం చెందటం తప్ప వాటిని పూర్తి చేసి ,ప్రారంభోత్సవాలు చేసిన పెద్ద ప్రాజెక్టులు గడచిన ఐదు సంవత్సరాలలో పట్టుమని ఐదు కూడా లేవు.
29,557 కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేసిన ఈ రహదారి నిర్మాణానికి కావలసిన భూసేకరణ బాధ్యత రాష్ట్ర తీసుకుంటే , రాష్ట్రం మీద ఆర్ధిక భారం పడకుండా BTO పద్దతిలో నిర్మిస్తామని రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2016లోప్రకటించారు.చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఆరు నెలలోనే భూసమీకరణ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ భూసమీకరణ జరగలేదు.
ఈ రహదారి నిర్మాణం మీద ప్రస్తుత జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిన్నవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఈ విషయం మీద అడిగిన ప్రశ్నకు కేంద్ర రావాణా శాఖా మంత్రి సమాధానంగా “భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా గ్రాండ్ చాలెంజ్ కింద కొత్తగా రహదారి ప్రాజెక్ట్‌లు నిర్మిస్తామని, అలాంటి ప్రాజెక్ట్‌ల్లో భూసేకరణకు అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్రాలు భరిస్తే మిగిలిన వ్యయంతోపాటు ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని కూడా కేంద్రమే భరిస్తుందని” చెప్పారు.
అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే అనేక మార్లు రవాణా శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో సమావేశాలు నిర్వహించారని,‘భూసేకరణకు అయ్యే వ్యయంలో 50 శాతం భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని నితిన్ గడ్కరీ చెప్పారు .నితిన్ గడ్కరీ సమాధానంతో అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పనులు వేగం అందుకోనున్నాయి.నిర్మాణ పనులు ఆరంభించడానికి పొందవలసిన చట్టబద్దమైన అనుమతులు, నిధుల సమీకరణ మీద దృష్టి పెడతామని విజయ సాయి రెడ్డి చెప్పారు.
393 కి.మీ పొడవైన ఈ రహదారి నల్లమల అడవులను దాటాలి. అనేక చోట్ల టన్నెల్స్ తొవ్వ వలసి ఉంది . ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టిపెడితే రెండు,మూడు సంవత్సరాలలో అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం పూర్తి చెయ్యొచ్చు.