బోలెడు ప్రయోగాలతో సక్సెస్ లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్ ఈ మధ్య సౌత్ రీమేక్ లను విపరీతంగా ఇష్టపడుతున్నాడు. ఇటీవలే లారెన్స్ కాంచనను లక్ష్మీగా తీయించి బోలెడు విమర్శలు మూటగట్టుకున్నప్పటికీ అభిమానులు మాత్రం హిజ్రాగా అద్భుతమైన నటన ప్రదర్శించిన తమ హీరో కోసం చూడొచ్చని గట్టిగానే చెప్పుకున్నారు. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా ఓటిటి రిలీజ్ కాబట్టి హాట్ స్టార్ వ్యూస్ పరంగా భారీ జాక్ పాట్ కొట్టేసింది.
ఇటీవలే మరో కన్నడ రీమేక్ బెల్ బాటమ్ కూడా లాక్ డౌన్ లోనే శరవేగంతో విదేశాల్లో పూర్తి చేసిన అక్షయ్ తాజాగా బచ్చన్ పాండే కోసం రెడీ అవుతున్నాడు. ఇది వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ రీమెక్. అఫ్కోర్స్ ఒరిజినల్ వెర్షన్ తమిళ్ లో వచ్చిన జిగర్ తండాకే ఈ క్రెడిట్ దక్కుతుంది. ఇందులో హీరోయిన్ గా జాక్వాలిన్ ఫెర్నాండేజ్ ఎంపికయ్యింది. సినిమాల్లో నటించాలనే పిచ్చి ఉన్న లోకల్ మాఫియా గూండాగా కనిపించడం కోసం అక్షయ్ కుమార్ ప్రత్యేకంగా గెటప్ కూడా మార్చుకున్నాడు.
కథల కొరతో లేక వేగంగా తీయొచ్చనే లెక్కలో ఏమో గాని అక్షయ్ అనే కాదు ఇతర హీరోలు కూడా ఇక్కడి హిట్ సినిమాల మీద గట్టి కన్నే వేస్తున్నారు. బడ్జెట్ ఎక్కువ డిమాండ్ చేయకుండా త్వరగా పూర్తయ్యేలా కనిపించే సక్సెస్ఫుల్ మూవీస్ ని పోటీపడి మరీ హక్కులు కొనేసుకుంటున్నారు. ఆఖరికి ఫ్లాపయిన ఊసరవెల్లిని కూడా వదలడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఖైదీ నెంబర్ 150(తమిళ కత్తి)ని కూడా రీమేక్ చేయాలని అక్షయ్ కుమార్ ప్రయత్నించాడు కానీ ఎందుకో వర్కవుట్ అవ్వలేదు. బచ్చన్ పాండేలో ఓ కీలక పాత్ర కోసం ఆర్షద్ వార్సీని ఫైనల్ చేశారు