ఉన్నతాధికాల ఫేస్బుక్ నుంచి అర్జంటుగా డబ్బులు కావాలని మెస్సేజ్‌లు రావడం.. కొందరు సిబ్బంది వారు చెప్పిన అక్కౌంట్‌కు డబ్బులు పంపండం లాంటివి ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తెలంగాణాకు చెందిన సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు గుర్తించి అంతర్గతంగా దర్యాప్తును కొనసాగించారు. అయితే ఏకంగా నల్గొండ ఎస్పీ రంగనా«ద్ పేరుతో ఫేక్ఐడీ ద్వారా ఈ విధంగా డబ్బులకు రిక్వెస్ట్ రావడంతో ఆశాఖ అప్రమత్తమైంది.
రాజస్థాన్ నుంచి..
రాజస్థాన్‌లోని భరత్పూర్ నుంచి 10 మంది మైనర్లు ఈ విధంగా ఫేక్ ఐడీలు సృష్టించి డబ్బులకు రిక్వెస్టులు పంపుతున్నట్లు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తెలంగాణా పోలీస్‌లు విచారణ ప్రారంభించారు. వారి వద్ద నుంచి భారీగా సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఒడిస్సాలకు చెందిన 230 మంది పోలీసు సిబ్బంది ఫేక్ ఐడీలను వీరు సృష్టించినట్లు నల్గొండ పోలీస్‌లు తెలిపారు. వీరిలో కానిస్టేబుల్ నుంచి మొదలకుని అడిషనల్ డీజీ వరకు కేడర్లను వీరు వినియోగించేసారు.
ఒక్క తెలంగాణాలోనే వంద మందికి సంబంధించిన ఫేక్ ఐడీలను వీరు వినియోగించినట్టు తేలింది. తద్వారా దేశ వ్యాప్తంగా లక్షలాది రూపాయలను కొల్లగొట్టారు. నిందితుల్లో ఎక్కువ మంది తొమ్మిదోతరగతి లోపు వారే కావడంతో పోలీస్లే అశ్చర్యపోతున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.