Trent Boult Confirms This Is Last T20 World Cup: కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఊహించని నిర్ణయం.. నిరాశలో ఫ్యాన్స్!

కివీస్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ఊహించని నిర్ణయం.. నిరాశలో ఫ్యాన్స్!

టైటిల్ ఫేవరెట్స్​గా మెగా టోర్నీలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు.. గ్రూప్ దశ నుంచే ఎగ్జిట్ అయింది. వరుస పరాజయాలతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.

టైటిల్ ఫేవరెట్స్​గా మెగా టోర్నీలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు.. గ్రూప్ దశ నుంచే ఎగ్జిట్ అయింది. వరుస పరాజయాలతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.

టీ20 వరల్డ్ కప్-2024 బిగ్ టీమ్స్​కు ఏమాత్రం కలసిరావడం లేదు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగుతున్న పెద్ద జట్లు తుస్సుమంటున్నాయి. పసికూనల చేతుల్లో ఓడి ఇంటిదారి పడుతున్నాయి. యూఎస్​ఏ-వెస్టిండీస్​లోని ట్రిక్కీ, స్లో పిచ్​లను అర్థం చేసుకోలేక తికమక పడుతున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్థాన్ లాంటి తోపు టీమ్స్ గ్రూప్ స్టేజ్​ నుంచి నిష్క్రమించాయి. లంక, పాక్​ను మినహాయిస్తే సెమీస్​కు చేరే జట్లలో ఒకటి అంటూ ప్రిడిక్షన్​లో టాప్​లో నిలిచిన కివీస్​కు ఈ గతి పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. జట్టు నిండా స్టార్లు ఉన్న న్యూజిలాండ్​ వరుసగా ఆఫ్ఘానిస్థాన్, వెస్టిండీస్ చేతుల్లో ఓడటం, మెగా టోర్నీ నుంచి వైదొలగడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. తమ జట్టు ఆటతీరు చూసి బాధపడుతున్నారు.

కేన్ విలియమ్సన్ సారథ్యంలో డెవిన్ కాన్వే, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు టీమ్​లో ఉన్నా న్యూజిలాండ్​కు ఓటములు తప్పలేదు. దీంతో ఆ జట్టు పరాభవానికి కారణాలు ఏంటనేది వెతకడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. మరోవైపు వరుస ఓటములతో కివీస్ డీలాపడింది. ఆ టీమ్‌ ప్లేయర్లు నిరాశలో కూరుకుపోయారు. ఈ తరుణంలో సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇక మీదట పొట్టి కప్పుల్లో కనిపించనని తెలిపాడు. ఇదే తనకు ఆఖరి టీ20 వరల్డ్ కప్ అని బౌల్ట్ అధికారికంగా ప్రకటించాడు. ఉగాండాతో మ్యాచ్ ముగిశాక అతడు ఈ అనౌన్స్​మెంట్ చేశాడు. ఈ మ్యాచ్​లో 4 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు బౌల్ట్.

ఉగాండాతో మ్యాచ్ అనంతరం బౌల్ట్ మాట్లాడుతూ.. ఇదే తనకు చివరి టీ20 ప్రపంచ కప్ అని తెలిపాడు. ఈ ఫార్మాట్​లో టిమ్ సౌతీతో కలసి ఎన్నో అద్భుతమైన మ్యాచుల్లో భాగస్వామిని అయ్యానని చెప్పాడు. తమ బౌలింగ్ పార్ట్​నర్​షిప్​ అద్భుతమని పేర్కొన్నాడు. ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నాడు బౌల్ట్. గ్రౌండ్​తో పాటు బయట కూడా సౌతీ లాంటి మంచి స్నేహితుడు తోడుగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇక, టీ20 వరల్డ్ కప్​లో ఓవరాల్​గా 17 మ్యాచులు ఆడిన బౌల్ట్.. 32 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ 6.07గా ఉంది. పొట్టి కప్పు హిస్టరీలో టాప్-10 ఆల్​టైమ్ వికెట్ టేకర్స్​లో బౌల్ట్​ది రెండో అత్యుత్తమ బౌలింగ్ ఎకానమీగా చెప్పొచ్చు. నెక్స్ట్ 2026లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. తాజా ప్రకటనతో ఆ టోర్నీలో బౌల్ట్ ఆడడని తేలిపోయింది. అయితే వచ్చే ఏడాది వన్డేల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో అందులోనైనా ఈ కివీస్ పేసర్ పాల్గొంటాడా? లేదా? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. మరి.. బౌల్ట్ ఇదే తనకు ఆఖరి పొట్టి కప్పు అని ప్రకటించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments