New Scam With The Help Of Deep Fake Technology: డీప్ ఫేక్ తో కొత్త స్కామ్.. అడ్డంగా దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు!

డీప్ ఫేక్ తో కొత్త స్కామ్.. అడ్డంగా దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు!

New Scam with Deepfake Technology: టెక్నాలజీ పెరిగిన తర్వాత సౌకర్యం ఎంత పెరిగిందో.. రిస్క్ కూడా అంతే పెరిగింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లోకి కొత్త కొత్త మోసాలు వస్తున్నాయి. తాజాగా డీప్ ఫేక్ టెక్నాలజీ వాడుకుని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

New Scam with Deepfake Technology: టెక్నాలజీ పెరిగిన తర్వాత సౌకర్యం ఎంత పెరిగిందో.. రిస్క్ కూడా అంతే పెరిగింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లోకి కొత్త కొత్త మోసాలు వస్తున్నాయి. తాజాగా డీప్ ఫేక్ టెక్నాలజీ వాడుకుని ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.

మాములుగా మనకి ఒకప్పుడు వీడియో కాల్స్ అంటేనే తెలీదు. ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తరువాత కొంత కాలానికి స్కైప్ వీడియో కాల్స్ అనేవి ప్రపంచంలో మొట్ట మొదటి సారి వీడియో కాల్స్ రూపంలో స్టార్ట్ అయ్యాయి. కానీ కాలం మారేకొద్దీ అన్నీ మన కంప్యూటర్ నుండి చేతిలో వాడుకునే మొబైల్ లోకి అప్డేట్ అయిపోయాయి. ఒకరి టెక్నాలజీని ఇంకొకరు వాడుకుంటూ ఇప్పుడు వాట్స్ ఆప్, ఫేస్ బుక్, ఇంస్టా, బోటిం, టెలిగ్రామ్, హైక్, డియో ఇలా ఎన్నో రకాల ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ వీడియో కాల్స్ అనేవి సర్వ సాధారణం అయిపోయాయి.

మనకి తెలిసిన వ్యక్తి మనకి వీడియో కాల్ చేసి నేను సమస్యలో ఉన్నాను అంటే గబ్బుక్కుని మనం సహాయం చేస్తాం. కానీ AI టెక్నాలజీలో డీప్ ఫేక్ అనే ఒక టూల్ ద్వారా వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళలాగా వీడియో కాల్ చేసి అలా మోసం చేస్తున్నారు అని గ్రహించలేకపోతాం. సరిగ్గా అలానే డియో ఆప్ ఉపయోగించి అందులో వీడియో కాల్ ద్వారా స్కామర్లు ప్రజలను మోసగించేందుకు ఈ కొత్త రూటును వాడుతున్నారు. డబ్బుల కోసం డీప్‌ఫేక్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండింగ్ సమస్యగా మారింది. మోసగాళ్లు నకిలీ వీడియోలు, ఆడియోలను సృష్టించడం ద్వారా ప్రజలని చాలా సులువుగా మోసం చేస్తున్నారు. తోటి వాడో లేదా తెలిసిన వ్యక్తి కష్టంలో ఉన్నాడు అంటే వెంటనే సాహయం చేసే గుణం దాదాపుగా అందరికీ ఉంటుంది. అయితే ఆ మంచి తనాన్నే అలుసుగా తీసుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు ఈ సైబర్ మోసగాళ్ళు.

డీప్‌ఫేక్ టెక్నాలజీ అంటే?:

డీప్‌ఫేక్ ద్వారా ఒక మనిషి వీడియో కాల్ చేస్తాడు. కానీ మనకి తెలిసిన మనిషి ఫోటోలను వారు సేకరించి ఈ టెక్నాలజీ ద్వారా ఆ వీడియో కాల్ లో ఉన్న మనిషి వీడియోకి ఈ ఫోటోని అటాచ్ చేస్తారు. అలా చేయడం వల్ల అచ్చం మనకి తెలిసిన వ్యక్తి ఎలా ఉంటారో అలానే ఆ వీడియో మారిపోతుంది. లైవ్ లో మనం కాల్ మాట్లాడుతున్నంత సేపు కూడా మనకి ఏ మాత్రం అనుమానం రాదు. అలానే వారి ఆడియోని కూడా వారి మాటలానే ఉంటుంది. అప్పుడు మనం అసలు అనుమానించడానికి స్కోపే ఉండదు కదా. ఈ డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి నేరగాళ్లు వీడియో కాల్‌ని చేస్తారు. మీకు తెలిసిన వ్యక్తిని పోలి ఉండే ముఖాన్ని మాత్రమే వాళ్ళు కనిపించేలా చేస్తారు.

మీకు వాళ్ళు కనిపించి ఏదో ఒక నిమిషం మాట్లాడి వెంటనే ఫోన్ కట్ చేసేస్తారు. మళ్లీ నార్మల్ ఫోన్ కాల్ ని చేస్తారు. అప్పుడే వీడియోలో మనకి తెలిసిన వ్యక్తిని చూసిన మనం వెంటనే నార్మల్ కాల్ చేసినా మనకి తెలిసిన వాడే అనుకుంటాం. కానీ ఇంకెవరో అని అనుకోము. అలా ముందు నమ్మించాకా నాకు అర్జెంటుగా డబ్బులు కావలి అని వేల నుండి లక్షల వరకు అడుగుతారు. అయ్యో పాపం ఇబ్బందుల్లో ఉన్నాడు కదా అని అనుకుని సహాయం చేస్తే ఇంక అంతే. అక్కడితో మన డబ్బులు స్వాహా అయినట్టే. ఇలా మీకు కాల్స్ వస్తే కంగారు పడకుండా అసలు మీకు తెలిసిన వ్యక్తి నెంబర్ కి మీరే కాల్ చేసి విషయం కనుక్కోండి. నిజ నిర్ధారణ అయిన తరవాతే డబ్బులని సహయం చెయ్యండి.

Show comments