New AI Features In Whatsapp: వాట్సాప్ లోకి AI కొత్త ఫీచర్స్.. ఇక ఆటోమేటిక్ గానే..

వాట్సాప్ లోకి AI కొత్త ఫీచర్స్.. ఇక ఆటోమేటిక్ గానే..

New AI Features In Whatsapp: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో సరికొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో వాట్సాప్ లోకి కొన్ని క్రేజీ ఫీచర్స్ వస్తున్నాయి.

New AI Features In Whatsapp: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో సరికొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో వాట్సాప్ లోకి కొన్ని క్రేజీ ఫీచర్స్ వస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో దాదాపుగా అందరికీ వాట్సాప్ గురించి బాగా తెలుసు. ఈ సోషల్ మెసేజింగ్ యాప్ చాలా అప్ గ్రేడ్ అయ్యింది. కేవలం మెసేజెస్ మాత్రమే కాకుండా.. కాల్స్, వీడియో కాల్స్, మీడియా షేరింగ్ కి వాడుతున్నారు. పేమెంట్స్ కి కూడా వాట్సాప్ లో అవకాశం ఉంది. ఇప్పుడు ఈ వాట్సాప్ మరింత అప్ గ్రేడ్ కాబోతోంది. దీనిలోకి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్స్ కూడా రాబోతున్నాయి. ఇప్పటికే వాట్సాప్ లో పలు ఆసక్తికర ఫీచర్స్ తీసుకొచ్చిన మెటా సంస్థ.. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్స్ మీద వర్క్ చేస్తోంది. ఈ ఫీచర్స్ అందుబాటులోకి వస్తే.. యూజర్ ఎక్స్ పీరియన్స్ కూడా మారిపోతుంది.

వాట్సాప్ సంస్థ తరచూ అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఇటీవలే చాట్ ఫిల్టర్స్ ని తీసుకొచ్చింది. అంటే గ్రూప్స్, చాట్స్, అన్ రీడ్ మెసేజెస్ అంటూ విడివిడగా చూపిచింది. కాకపోతే ఇప్పుడు కొన్ని స్పెషల్ ఫీచర్స్ మీద వర్క్ చేస్తోంది. వాట్సాప్ లో ఏఐ ఫీచర్స్ తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే అవి టెస్టింట్ దశలో ఉన్నాయి. అతి త్వరలోనే ఈ ఏఐ ఫీచర్స్ రాబోతున్నాయి అంటున్నారు. ఈ ఏఐ ఫీచర్స్ వచ్చిన తర్వాత వాట్సాప్ యూజర్ ఎక్స్ పీరియన్ మారిపోయే ఆస్కారం ఉంది. ఈ ఏఐ ఫీచర్స్ గురించి.. టిప్ స్టర్ సమాచారం అందించింది. ప్రస్తుతం ఈ అప్ డేట్ గురించి నెట్టింట పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ఈ కొత్త ఏఐ ఫీచర్ వస్తే.. వాట్సాప్ లో మీరు మీ డీపీని అప్ డేట్ చేసుకోవచ్చు. మీరు మీ డీపీ ఈ ఏఐ ఫీచర్ తో క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫీచర్ తో మీ ప్రొఫైల్ ఫొటోని క్రియేట్ చేసిన తర్వాత దానిని ఆటోమేటిక్ గా మీ డీపీగా పెట్టేసుకోవచ్చు. దానివల్ల మీకు ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ మీద మెటా వర్క్ చేస్తోంది. ఇప్పటికే మెటా సంస్థ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ప్లాట్ ఫామ్స్ కి సంబంధించి ఏఐ ఫీచర్స్ పై వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్ లోకి కూడా ఈ ఫీచర్స్ ని తీసుకురానున్నారు. వాట్సాప్ కి సంబంధించిన ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్స్ కొన్ని దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.

కాకపోతే అది కేవలం ఇంగ్లీష్ కమాండ్స్ ని మాత్రమే తీసుకుంటుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఏఐ సర్వీసెస్ చాట్ జీపీటీ. జెమిని ఏఐ, గూగుల్ తరహాలో అందే ప్రయోజానలను పొందే ఛాన్స్ ఉంటుంది. ఈ సర్వీసెస్ లో టెక్ట్స్, ప్రాంప్ట్ తో మీరు మీకు కావాల్సిన ఫొటలను క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఫొటోలు హై క్వాలిటీతో కూడా ఉంటాయి. ప్రస్తుతం వాట్సాప్ ఏఐ ఫీచర్స్ గురించి బాగానే చర్చ జరుగుతోంది. మరి.. అవి విడుదల అయ్యాక ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. వాట్సాప్ లో ఏఐ ఫీచర్స్ రాబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments