iDreamPost

అత్యాచారం కేసు.. దోషిగా స్టార్ క్రికెటర్.. జైలు శిక్ష!

  • Published Dec 29, 2023 | 10:13 PMUpdated Dec 29, 2023 | 10:13 PM

ఒక ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. అసలు ఎవరా క్రికెటర్? ఏంటా కేసు? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. అసలు ఎవరా క్రికెటర్? ఏంటా కేసు? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 29, 2023 | 10:13 PMUpdated Dec 29, 2023 | 10:13 PM
అత్యాచారం కేసు.. దోషిగా స్టార్ క్రికెటర్.. జైలు శిక్ష!

క్రికెట్​ను ఇష్టపడే వారు కోట్లలో ఉన్నారు. క్రికెటర్లను అభిమానించే వారు, ఆరాధించే వారు లెక్కలేనంత మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెటర్ అంటే చాలు.. వారికి ఉండే గుర్తింపు, దక్కే గౌరవమర్యాదలు అంతా ఇంతా కాదు. జెంటిల్మన్ గేమ్ అంటే పడిచచ్చే భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లాంటి ఆసియా దేశాల్లో క్రికెటర్లకు భారీ ఫ్యాన్​బేస్ ఉంటుంది. పసికూన అయిన నేపాల్​లోనూ అక్కడి ప్లేయర్లను జనాలు తెగ ప్రేమిస్తారు. నేపాల్​లో జరిగే లోకల్ మ్యాచులకు కూడా ఇసుక వేస్తే రాలనంత మంది అటెండ్ అవుతారు. అలాంటి దేశానికి కెప్టెన్​గా వ్యవహరించిన ఆటగాడే సందీప్ లమిచానే. నేపాల్​ క్రికెటర్​గా కంటే ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు లమిచానే. అలాంటి క్రికెటర్ ఓ కేసులో దోషిగా తేలాడు.

మైనర్ బాలిక మీద అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సందీప్ లమిచానేని ఖాట్మండు డిస్ట్రిక్ట్ కోర్ట్ దోషిగా తేల్చింది. అతడు అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధారించింది న్యాయస్థానం. అయితే, అత్యాచారం జరిగిన టైమ్​లో ఆ బాలిక మైనర్ కాదని తెలిపింది. శిశిర్​ రాజ్​ ధాకల్​తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. కాగా, 2022, ఆగస్టు 21వ తేదీన ఖాట్మండులోని ఒక హోటల్​లో లమిచానే తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు గతేడాది పోలీసులకు కంప్లయింట్ చేసింది. తనను మభ్యపెట్టి లమిచానే ఈ విధంగా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని ఇన్వెస్టిగేషన్​కు అటెండ్ అవ్వాలని ఆదేశించారు. అయితే, లమిచానే తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆ టైమ్​లో కరీబియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడుతున్న లమిచానే అక్కడే ఉండిపోయాడు.

Star cricketer convicted in rape case!

కరీబియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడుతూ లమిచానే అక్కడే ఉండిపోవడంతో నేపాల్ పోలీసులు ఇంటర్​పోల్​ను ఆశ్రయించారు. ఇంటర్​పోల్ సాయంతో అతడ్ని స్వదేశానికి రప్పించారు. ఆ తర్వాత అతడు బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. కానీ ఈ కేసులో తాజాగా విచారణ జరిపిన కోర్టు అతడు దోషి అని తేల్చింది. నేరం చేశాడని తేలడంతో లమిచానేకు జైలు శిక్ష పడనుంది. అయితే ఎన్ని రోజులు శిక్ష పడుతుందనేది జనవరి 10, 2024న తేలనుంది. ఆ రోజు కోర్టు అతడికి శిక్ష ఖరారు చేయనుంది. ఇక, 23 ఏళ్ల లమిచానే ఐపీఎల్​లో ఆడిన తొలి నేపాలీ క్రికెటర్ కావడం గమనార్హం. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున క్యాష్ రిచ్ లీగ్​లో అతడు ఎంట్రీ ఇచ్చాడు. మరి.. అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన క్రికెటర్ ఇలా అత్యాచారం కేసులో దోషిగా తేలడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs SA: అలెన్ డొనాల్డ్ మాట నిజమైంది.. ఆయన చెప్పినట్లే ఓడిన భారత్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి