NEET UG 2024 Row: NEET 2024 పరీక్ష కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!

NEET UG 2024 Row: NEET 2024 పరీక్ష కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!

NEET UG 2024: ఇటీవల జరిగిన వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ విషయంలో గందరగోళం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు నీట్ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ అంశం విషయంలో స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

NEET UG 2024: ఇటీవల జరిగిన వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ విషయంలో గందరగోళం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు నీట్ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆ అంశం విషయంలో స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

దేశ వ్యాప్తంగా వైద్యవిద్యలో ప్రవేశాల కోసం  నీట్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఏటా మాదిరిగానే ఈ ఏటాది కూడా ఈ ఎంట్రన్స్ టెస్ట్ లు జరిగాయి. అయితే ఈ సారి మాత్రం ఈ పరీక్ష చుట్టు అనేక వివాదాలు అలుముకున్నాయి. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టు వెళ్లారు. అలాగే నీట్-యూజీ 2024 పరీక్షలను రద్దు చేయాలని కోరారు. దీనిపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి నోటీసులు జారీ చేసింది.  విక్రమ్ నాథ్, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం నోటీసులు ఇష్యూ చేసింది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారి ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

వెైద్య విద్యా ప్రవేశాల కోసం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహిస్తారు. ఇక మెరిట్ పొందిన విద్యార్థులకు దేశంలోని వివిధ మెడికల్ కాలేజిల్లో అడ్మిషన్లు పొందుతుంటారు. ఈ పరీక్షలను ఏటా నిర్వహిస్తుంటారు. అలానే ఈ ఏటాది కూడా నీట్ యూజీ 2024 పరీక్ష జరిగింది. ఈ క్రమంలోనే ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఈ పరీక్షలపై అనేక ఆరోపణలు వచ్చాయి. నీట్ 2024 పరీక్ష లీక్ అయిందని, పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆరోపించాయి. అంతేకాక పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఈ క్రమంలోనే జూన్ 11న వారి పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించింది.

ఈ క్రమంలోనే తాజాగా గురువారం సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నీట్‌ కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెబ్‌ కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం  ఒప్పుకోలేదు. కౌన్సెలింగ్‌ యథాతథంగా కొనసాగుతుందని చెప్పడంతో పాటు ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కి, కేంద్రంకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విషయంపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది. జులై 6వ తేదీ నుంచి నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

ఇక  అసలు విషయానికి వస్తే…ఏటా  మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మే 5వ తేదీన దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష ఎన్టీఏ నిర్వహించింది. దాదాపు 4,750 కేంద్రాల్లో నీట్ పరీక్షను నిర్వహించారు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది అభ్యర్థులరు 720కి  720 మార్కులు వచ్చాయి. హర్యాన రాష్ట్రంలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అసలు కథ మొదలైంది. అందరిలో అనుమానాలకు ఇది ప్రధాన కారణమైంది. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని విద్యార్థులు ఆందోళనలు సైతం చేశారు. విద్యార్థులకు ర్యాండమ్‌గా 70 నుంచి 80 మార్కులు కలిపారని ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండే  తెలిపారు. అంతేకాక ఆయన  సుప్రీంకోర్టులో కూడా పిటిషన్‌ దాఖలు చేశారు.  ఈ ఏడాది జరిగిన నీట్‌ పరీక్ష లో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్‌ మార్కులు ఇవ్వడంతోనే ఈ వివాదం మొదలైంది.

Show comments