సూది మందు వ‌చ్చే వ‌ర‌కూ త‌ప్ప‌దు: మోదీ

సూది మందు వ‌చ్చే వ‌ర‌కూ త‌ప్ప‌దు: మోదీ

వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కూ స‌బ్బు నీటితో చేతులు క‌డుక్కోవ‌డం, బ‌య‌ట‌కు వెళ్తే మాస్కులు పెట్టుకోవ‌డం, దూరం పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. సూది మందు వ‌చ్చే వ‌ర‌కూ జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే అని ప్ర‌ధాని మంత్రి న‌రేంద్ర మోదీ సూచించారు. వలస కూలీల కోసం రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర ప్రదేశ్ రోజ్‌గార్ అభియాన్’ పథకాన్ని శుక్రవారం ఆయ‌న ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ప్రారంభించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. క‌రోనా క‌ట్ట‌డికి ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప్ర‌శింసించారు. అక్క‌డి ప్ర‌జాల‌తో మాట్లాడారు. ప్ర‌పంచంలోని బ‌లైమైన దేశాలు సైతం క‌ట్ట‌డి చేయ‌లేని మ‌హ‌మ్మారిని యూపీ వాసులు క‌చ్చితంగా ఎదుర్కొంటున్నార‌ని, అందుకే ఇక్క‌డ మ‌ర‌ణాల రేటు త‌క్కువగా ఉంద‌ని చెప్పారు. అయినా ఎవ‌రూ చ‌నిపోకుండా, వైర‌స్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా న‌డుచుకోవాల‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని వివ‌రించారు.

ప్రపంచమంతా ఒకే సమయంలో. క‌రోనాతో పోరాడుతోంద‌ని, ఇలా ఒకే సమస్యను అంద‌రూ ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఎవరూ ఊహించి ఉండ‌ర‌ని అన్నారు. స్థానిక వ్యాపారాల అభివృద్ధికి ఆత్మ నిర్భర్ ఎంతో దోహ‌దం చేస్తుంద‌ని వెల్ల‌డించారు. ప్రధాన మంత్రి రోజ్‌గార్ అభియాన్ యోజన పనిశక్తిపైనే ఆధారపడి ఉందని, ఈ పథకానికి అదే ప్రేరణ అని ప్రకటించారు. యూపీ లాగా ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి పథకాలను తెస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో యూపీ ప్రభుత్వం అత్యంత ధైర్య సాహసాలతో పని చేసిందని, కరోనాతో పోరాడుతోందని మోదీ ప్రశంసించారు. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ముందుంటున్నార‌ని, అది అభినంద‌నీయ‌మ‌ని వెల్ల‌డించారు. వ‌ల‌స కూలీల‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం విశేష కృషి చేస్తోంద‌ని అన్నారు. లాక్ డౌన తో ఎక్క‌డిక‌క్క‌డ ఉండిపోయిన కూలీల‌ను ప్ర‌త్యేక రైళ్ల ద్వారా త‌ర‌లించే కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంద‌ని తెలిపారు.

Show comments