సుధీర్ బాబుకు కొత్త టాగ్.. ఎంటో తెలుసా? 

సుధీర్ బాబుకు కొత్త టాగ్.. ఎంటో తెలుసా? 

టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబుకు 'నైట్రో స్టార్' అనే టాగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ టాగ్ మారి కొత్తది సుధీర్ బాబు పేరు ముందు చేరింది. మరి ఆ కొత్త టాగ్ ఏంటి? చూద్దాం పదండి.

టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబుకు 'నైట్రో స్టార్' అనే టాగ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ టాగ్ మారి కొత్తది సుధీర్ బాబు పేరు ముందు చేరింది. మరి ఆ కొత్త టాగ్ ఏంటి? చూద్దాం పదండి.

సినిమా ఇండస్ట్రీలో దాదాపు ప్రతీ హీరోకి టాగ్ ఉంటుంది. ఆ పేరుతోనే అభిమానులు ముద్దుగా తమ హీరోలను పిలుచుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్ లో చిరంజీవికి ‘మెగాస్టార్’, వెంకటేష్ కి ‘విక్టరీ’, పవన్ కళ్యాణ్ కు ‘పవర్ స్టార్’, ఎన్టీఆర్ కు ‘యంగ్ టైగర్’, మహేశ్ బాబుకు ‘సూపర్ స్టార్’, అల్లు అర్జున్ కు ‘ఐకాన్ స్టార్’ అన్న టాగ్ లు ఉన్న విషయం మనందరికి తెలిసిన విషయమే. వీరితో పాటుగా దాదాపు అందరి హీరోలకు ఏదో ఒక టాగ్ ఉంది. అలాగే సుధీర్ బాబుకు కూడా ‘నైట్రో స్టార్’ అనే టాగ్ ఉంది. కానీ ఇప్పుడు అది కనిపించదు. ఆ ప్లేస్ లో ఓ కొత్త టాగ్ వచ్చి చేరింది. అదేంటో తెలుసుకుందాం పదండి.

సుధీర్ బాబు.. జయాపజయాలకు అతీతంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ముందుకువెళ్తున్నాడు. తాజాగా డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కించిన ‘హరోం హర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జూన్ 14న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి.. పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీతో సుధీర్ బాబుకు ‘నైట్రో స్టార్’ అనే టాగ్ పోయి, కొత్త టాగ్ వచ్చి చేరింది. సుధీర్ బాబుకు న్యూ టాగ్ పెడుతున్నామని అది మూవీ రిలీజ్ రోజే థియేటర్లలో చూడండని డైరెక్టర్ చెప్పాడు.

ఇక ఈరోజు హరోం హర మూవీ విడుదల అయ్యింది. టైటిల్స్ పడే సమయంలో సుధీర్ బాబు పేరుకు ముందు ‘నవ దళపతి’ అనే కొత్త టాగ్ పడింది. ఇక నుంచి సుధీర్ టాగ్ ‘నవ దళపతి’ కానుంది. ఇక కొన్ని రోజుల క్రితమే శర్వానంద్ కు కూడా కొత్త టాగ్ ఇచ్చారు. మనమే మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వ ప్రసాద్ ‘చార్మింగ్ స్టార్’ అని శర్వానంద్ కు కొత్త టాగ్ ఇచ్చాడు. మరి సుధీర్ బాబు కొత్త టాగ్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments