iDreamPost

జగనన్న గోరుముద్ద పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు

జగనన్న గోరుముద్ద పథకంపై జాతీయ స్థాయిలో ప్రథమ అవార్డు రావడం విశేషం. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్త్రీ, శిశవు సంక్షేమ మంత్రిత్వశాఖ డిప్యూటీ కమిషనర్ డా.జోయా అలీ రిజ్వీ ఈ అవార్డను అందజేశారు.

జగనన్న గోరుముద్ద పథకంపై జాతీయ స్థాయిలో ప్రథమ అవార్డు రావడం విశేషం. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్త్రీ, శిశవు సంక్షేమ మంత్రిత్వశాఖ డిప్యూటీ కమిషనర్ డా.జోయా అలీ రిజ్వీ ఈ అవార్డను అందజేశారు.

జగనన్న గోరుముద్ద పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు

ఏపీ ప్రభుత్వం గవర్నమెంట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు జగనన్న గోరుముద్దు పేరుతో పౌష్టికాహారం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇది వరకే ఉన్న మధ్యాహ్న భోజన పథకంలో కొన్ని మార్పులు చేసి 2020 జనవరి 21న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి జగనన్న గోరుముద్దు పథకాన్ని ప్రారంభించారు. పాత మెనూలో మార్పులు చేసి అప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. కాగా, ఈ మెనూలో భాగంగా సోమవారం.. వెజ్ పులావ్ , గుడ్డు కర్రీ, హాట్ పొంగల్ , బాయిల్డ్ ఎగ్, చిక్కి ఇస్తారు. ఇక మంగళవారం రోజు చింతపండు పులిహోర, రాగి జావ, దొండకాయ చట్నీ,ఉడికించిన గుడ్డు వంటివి అందిస్తారు.

ఇక బుధవారం రోజు మాత్రం వెజిటేబుల్ రైస్, బంగాళదుంప కుర్మా, గ్రుడ్డుతో పాటు చిక్కి పిల్లలకు అందజేస్తారు. ఇదే కాకుండా గురువారం రోజు టొమాటో చట్నీ, గుడ్డు, సాంబార్ అన్నం, నిమ్మకాయ పులిహోర, రాగి జావ అందిస్తారు. ఇక శుక్రవారం రోజు మాత్రం అన్నం, కోడిగుడ్డు, ఆకు కూర, చిక్కి ఇస్తారు. చివరగా శనివారం రోజు అన్నం, సాంబార్, పాయసం లేదా స్వీట్ పొంగల్ తో పాటు రాగి జావ అందిస్తూ పిల్లలకు పౌష్టికాహారాలు అందిస్తున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన స్థానంలో జగనన్న గోరుముద్దు పథకాన్ని చేర్చి ఆ మెనూలో మార్పులు చేశారు.

దీంతో ఈ పథకానికి ఇప్పడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం విశేషం. అయితే కౌమరదశలో ఉన్న పిల్లల్లో రక్తహీనత నివారణ కోసం చేస్తున్నసేవల కోసం ఈ పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తాజాగా జగనన్న గోరుముద్ద పథకానికి ప్రథమ బహుమతి లభించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్త్రీ, శిశవు సంక్షేమ మంత్రిత్వశాఖ డిప్యూటీ కమిషనర్ డా.జోయా అలీ రిజ్వీ ఈ అవార్డను అందజేశారు. ఏపీ విద్యాశాఖ నోడల్ అధికారి పి. హేమారాణి, హెల్త్ డిపార్ట్ మెంట్ శాఖ నోడల్ ఆఫీసర్ దేవి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ నోడల్ అధికారి శ్రీదేవి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు అందజేసిన స్త్రీ, శిశవు సంక్షేమ మంత్రిత్వశాఖ డిప్యూటీ కమిషనర్ డా.జోయా అలీ రిజ్వీ జగనన్న గోరుముద్ద పథకంపై ప్రశంసలు కురిపించారు. ఇంతే కాకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి పిల్లలపై పౌష్టికాహార విషయంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొనియాడారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి