మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న నాని- విజయ్ దేవరకొండ!

మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్న నాని- విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఇద్దరి స్టార్ హీరోలా కాంబో రిపీట్ కాబోతుంది. త్వరలోనే నాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ ఒకే స్క్రీన్ పై సందడి చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఇద్దరి స్టార్ హీరోలా కాంబో రిపీట్ కాబోతుంది. త్వరలోనే నాచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ ఒకే స్క్రీన్ పై సందడి చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. మరి ఆ వివరాలేంటో చూద్దాం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ ఆశ్విన్ కాంబోలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 ఏడి’. కాగా, ఈ సినిమా జూన్ 27వ తేదీన గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా కోసం డార్లింగ్ అభిమాలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కల్కి సినిమాకు సంబంధించి పోస్టర్, ట్రైలర్ రిలీజై భారీ రెస్పాన్స్ రావడంతో.. అందరికి ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి.ముఖ్యంగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ ను కొల్లగొడతయని డార్లింగ్ అభిమానులు తెగ హంగామా చేస్తున్నారు. అంతేకాకుండా.. ఇప్పటి నుంచే అడ్వాన్స్ బుకింగ్ లు కూడా భారీ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే 600 కోట్ల బడ్జెట్ తెరకెక్కున్న ఈ సినిమాకు వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ అ్యతంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో అమితా బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్, దిశా పటానీ, సస్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మనందం, అన్నాబెన్, శోభన స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే..ఇప్పుడు ‘కల్కి’ సినిమాలో వీరు కాకుండా.. మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా నటించనున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అందులో ఇప్పటికే విజయ్ దేవరకొండ పేరు వినిపిస్తుండగా.. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని పేరు తెరపై వినిపిస్తుంది. కాగా, మహా భారతంలో అర్జునుడి పాత్రలో విజయ్ కనిపించనున్నరనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.అయితే ఇందులో నాని కృష్ణుడిగా కనిపిస్తారని టాక్ జోరుగా నడుస్తోంది. కాగా, ఇప్పటికే కల్కి ట్రైలర్ రిలీజ్ కావడంతో అందులో ప్రభాస్ భైరవ అని టాక్ వినిపించగా..ఇప్పుడు తెరపై ఈ ఇద్దరి స్టార్ హీరోల పేర్లు వినిపించడం గమన్హారం.అయితే మరొపక్క కొందురు ప్రభాస్ భైరవ అయితే.. కల్కిగా విజయ్ దేవరకొండ అంటూ కొత్త రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారు.

కానీ, అవి అన్ని నిజం కాదని ఈ సినిమాలో కల్కిగా వేరొకరు ఉండరు అని అంటున్నారు. మరి, ఏదీ ఏమైనా ప్రభాస్ కల్కి సినిమాలో ఈ ఇద్దరు స్టార్ హీరోలు భాగం అవుతారా.. ముగ్గురు కాంబోలో సన్నివేశాలు ఉంటాయో లేదో అని సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి ఉండాలి. ఇకపోతే వైజయంతి, స్వప్న సంస్థల్లో సినిమాలు చేసిన నటులందరూ చిన్నదో,పెద్దదో ఏదో ఒక క్యారెక్టర్ ద్వారా కల్కిలో భాగమయ్యారని సమాచారం. అయితే ప్రస్తుతానికి కల్కి సినిమా విడుదలకు ఇంకో పదమూడు రోజులు మాత్రమే ఉంది.ఒకవేళ నాగ్ ఆశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి సినిమాలో నిజంగా నాని, విజయ్ దేవరకొండ భాగమైతే.. వీరి ముగ్గురి కాంబోలో వచ్చిన రెండవ సినిమా కల్కి అవుతుంది. ఎందుకంటే.. గతంలో నాగ్ అశ్విన్ కమర్షియల్ పరంగా కాకపోయినా,సబ్జెక్టు పరంగా.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఇక ఈ సినిమాతో తన ప్రతిభను బయటకి తీశాడు.

ఇక ఈ సినిమాలో నాని ఫ్రెండ్ రిషిగా విజయ్ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే. ఇక అప్పటిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. అయితే ఈ ఇద్దరి కాంబోలో ఆ సినిమా వచ్చి తొమ్మిదేళ్లు అవుతుంది. కానీ,ఇంతవరకు మళ్లీ ఇద్దరు ఏ సినిమాలో నటించలేదు. కానీ, ఈసారి కల్కి సినిమాలో ఈ కాంబో రిపీట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంటుంది. మరి, కల్కి సినిమాలో నాని, విజయ్ దేవరకొండ నటిస్తున్నారు అనే టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ర్ రూపంలో తెలియజేయండి.

Show comments