My Gov-Create A Logo For Lakhpati Didi Scheme: కేంద్రం అదిరే ఆఫర్‌ ఈ ఒక్క పని చేస్తే చాలు.. అకౌంట్‌లోకి ఉచితంగా రూ.50 వేలు

కేంద్రం అదిరే ఆఫర్‌ ఈ ఒక్క పని చేస్తే చాలు.. అకౌంట్‌లోకి ఉచితంగా రూ.50 వేలు

కేంద్రం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండా.. రూపాయి ఖర్చు చేయకుండా ఏకంగా 50 వేల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

కేంద్రం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండా.. రూపాయి ఖర్చు చేయకుండా ఏకంగా 50 వేల రూపాయలు పొందే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..

కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం అనేక రకాల పథకాలతో పాటు అప్పుడప్పుడు కొన్ని పోటీలు కూడా నిర్వహిస్తుంటుంది. వీటి ద్వారా.. లబ్ధిదారులు, విజేతలకు భారీ మొత్తంలో ప్రైజ్‌ మనీ ఇస్తూ.. వారిని ప్రోత్సాహిస్తుంది. అలానే తాజాగా కేంద్రం ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. మీరు ఇల్లు కదలకుండా.. జేబు నుంచి రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేకుండా.. భారీ మొత్తంలో డబ్బులు పొందవచ్చు. ఇందు కోసం మీరు ఓ చిన్న పని చేయాలి. అలా చేస్తే.. కేంద్ర ప్రభుత్వం మీకు 50 వేల రూపాయలు ఇవ్వనుంది. ఇవి నేరుగా మీ ఖాతాలో పడతాయి. మరి ఈ మొత్తం పొందాలంటే.. ఏం చేయాలి.. అసలు కేంద్రం ఎందుకు ఇంత భారీ మొత్తంలో నగదు ఇస్తుంది అనేది తెలియాలంటే.. ఇది చదవండి.

మరి 50 వేల రూపాయల నగదు పొందాలంటే మీరు ఏం చేయాలంటే.. కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తోన్న ఓ పోటీలో పాల్గొని మీ ప్రతిభ చూపాలి. దీనిలో గెలిస్తే.. మీ ఖాతాలో 50 వేల రూపాయలు జమ చేస్తారు. ఇంతకు ఈ పోటీ దేని గురించి అంటే.. లఖ్‌పతి దీదీ స్కీమ్‌ లోడో డిజైన్ కోసం. కేంద్రం ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వాలంభన కలిగించి.. వారిని లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో ఈ లఖ్‌పతి దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే నేటికి కూడా చాలా మందికి ఈ పథకం గురించి తెలియదు. ఈ స్కీమ్‌ గురించి అవగాహన కల్పించడం కోసం కేంద్రం లోగో డిజైన్‌ పోటీని నిర్వహిస్తోంది. ఇక ఈ పోటీలో పాల్గొని.. గెలుపొందిన వారికి వారికి రూ. 50 వేలు లభిస్తాయి. అంటే మీరు ఇంట్లో కూర్చునే ఈ మొత్తాన్ని పొందొచ్చు.

లోగో విషయానికి వస్తే.. మీరు డిజైన్‌ చేసే లోగో.. స్వయం ఉపాధి సంఘాలకు చెందిన మహిళల సాధికారతను సూచించేలా ఉండాలి. స్వయం సహాయక సంఘాల లక్ష్యం లక్షాధికారులు అవ్వడమే అనే అంశాన్ని తెలియజేసేలా లోగో ఉండాలి. ఇలా ఈ అంశాలు పరిగణలో ఉంచుకొని లోగోను డిజైన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ పోటీ మీద ఆసక్తి ఉంటే.. మైగౌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీరు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనవచ్చు. ఈ కాంటెస్ట్ జూన్ 10న ప్రారంభం అయ్యింది. ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనుంది.

మరి మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయండి. మంచి లోగో డిజైన్ చేసి.. సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. ఇక ఈ పోటీలో భారతీయ పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే మైగౌ, రూరల్ డెవలప్‌మెంట్ శాఖ ఉద్యోగులకు మాత్రం ఈ పోటీలో పాల్గొనే అవకాశం లేదు. పోటీలో పాల్గొనే వ్యక్తి.. ఒక్కసారి మాత్రమే లోగో డిజైన్ చేసి పంపాల్సి ఉంటుంది. దీనిలో విజేతగా నిలిచిన వ్యక్తికి సెంట్రల్‌ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ ప్రైజ్‌ మనీగా 50 వేల రూపాయలు ఇస్తుంది.

Show comments