ఆన్ లైన్‌లో ఐస్ క్రీం ఆర్డర్ చేస్తే.. చేతి వేలు వచ్చింది..

ఆన్ లైన్‌లో ఐస్ క్రీం ఆర్డర్ చేస్తే.. చేతి వేలు వచ్చింది..

ఐస్ క్రీం తినాలిపిస్తుందా..? అయితే ఏ ఫ్లేవర్ ఇష్టం.. వెనీలానా, బటర్ స్ట్కాచా, స్ట్రాబెరీనా.. ఏ ఐస్ క్రీం తినాలనుకున్నా.. ఈ వార్త చూడండి.. వెంటనే దానిపై విరక్తి పుట్టడం ఖాయం.

ఐస్ క్రీం తినాలిపిస్తుందా..? అయితే ఏ ఫ్లేవర్ ఇష్టం.. వెనీలానా, బటర్ స్ట్కాచా, స్ట్రాబెరీనా.. ఏ ఐస్ క్రీం తినాలనుకున్నా.. ఈ వార్త చూడండి.. వెంటనే దానిపై విరక్తి పుట్టడం ఖాయం.

ఎండాకాలంలో..చిన్నలు, పెద్దలు ఇష్టపడేది హిమ క్రీములు. ఇలా అర్థం కావడం లేదు కదా.. అదేనండీ ఐస్ క్రీమ్స్. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదా. ఒకప్పుడు పుల్ల ఐస్‌లు తిని ఎంజాయ్ చేసిన రోజుల నుండి ఇప్పుడు వివిధ కంపెనీలకు సంబంధించిన ఐస్ క్రీమ్స్ ఆర్డర్ పెట్టుకునే స్థాయికి ప్రపంచం ఎదిగి పోయింది. ఐస్ క్రీమ్ తీసుకు రాగానే.. చటుక్కున తినేసి.. హమ్మయ్య అనుకోవడం పరిపాటి. ఇంట్లో పిల్లలు ఉంటే ఐస్ క్రీమ్స్ కోసం యుద్దాలే జరిగిపోతుంటాయి. వారికి సర్ది చెప్పలేక తల ప్రాణాలు తోకకు వస్తుంటాయి పేరెంట్స్‌కు. ఐస్ క్రీమ్ ఇష్టపడని నర మానవుడు ఉండడేమో బహుశా. ఇంతలా మనస్సుకు దగ్గరైన ఈ పదార్థం ఇప్పుడు ఓ డాక్టర్ని భయపెట్టింది.

ఐస్ క్రీమ్ తిందామని ఓ మహిళ ఆర్డర్ పెడితే.. ఇంటికి వచ్చింది. తీరా తిందామని ట్రై చేస్తుంటే.. ఏదో వింతగా కనిపించింది. పరిశీలనగా చూస్తే.. తెలిసింది అది డ్రై ఫ్రూట్ కాదని, మానవుని వేలని. దీంతో ఖంగుతినడం అతడి వంతైంది. ఈ ఘటన ముంబయిలోని మలాద్ నివాసి అయిన డాక్టర్ బ్రెండన్ ఫెర్రావ్ ఆన్ లైన్ యాప్ ద్వారా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాడు. ఐస్ క్రీం తీసుకుని తిందామనుకునేలోపు ఏదో పెద్ద ముక్కలా కనిపించింది. తొలుత అదేదో గింజ అనుకున్నాడట. కానీ దగ్గరగా చూసిన తర్వాత గోరు కనిపించిది. తెరిపార చూస్తే తెలిసింది అది చేతి వేలని.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఐస్ క్రీం కంపెనీ యమ్మోపై ఫిర్యాదు చేశాడు. తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.

పోలీసులు తెలిపిన చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఎంబీబీఎస్ చదివిన 26 ఏళ్ల వైద్యుడు బ్రెండన్.. లంచ్ తర్వా త ఐస్ క్రీం తిందామనిపించి.. ఆన్ లైన్ ఆర్డర్ పెట్టుకున్నాడు. మయ్మో కంపెనీ నుండి బటర్ స్కాచ్ ఆర్డర్ చేశాడు. ప్యాక్ తీసి తిందామని అనుకుంటుండగా.. ఐస్ క్రీంలో ఏదో కనిపించింది. డాక్టర్ కావడంతో తొలుత దాన్ని ఫోటోలు తీశాడు. వెంటనే మరోసారి చూడగా.. అది చేతి వేలు అని తేలింది. దీంతో అతడు తమకు ఫిర్యాదు చేశాడంటూ పోలీసులు వెల్లడించారు. అతని నుండి ఫిర్యాదు అందుకున్న మలాద్ పోలీసులు ఆ వేలు ముక్కను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపుతామని తెలిపారు.ఈ ఘటనను సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Show comments