iDreamPost

తల్లి ఇక లేదని తెలిసి ఆవేదన చెందిన కుమారుడు.. రెండు గంటల్లోనే

చిట్టి గుండె ఎంత పని చేస్తుంది. రోజు రోజుకు దాని పనితీరు క్షీణిస్తుంది. ఆనంద సమయాల్లోనూ, విషాద ఘటియల్లోనూ మెలిపెట్టి చంపేస్తుంది. చూస్తుండగానే మనుషుల ప్రాణాలను హరించేస్తుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో..

చిట్టి గుండె ఎంత పని చేస్తుంది. రోజు రోజుకు దాని పనితీరు క్షీణిస్తుంది. ఆనంద సమయాల్లోనూ, విషాద ఘటియల్లోనూ మెలిపెట్టి చంపేస్తుంది. చూస్తుండగానే మనుషుల ప్రాణాలను హరించేస్తుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో..

తల్లి ఇక లేదని తెలిసి ఆవేదన చెందిన కుమారుడు.. రెండు గంటల్లోనే

పిడికెడంత గుండె మనుషుల ప్రాణాలను హరించేస్తుంది. ఉన్నపళంగా ఉసురు తీసుకుంటుంది. అప్పటి వరకు మన కళ్ల ముందు మాట్లాడిన వ్యక్తి.. మరుక్షణం కనిపించకుండా పోతున్నాడు. దానికి కారణం గుండె పోటు.  ఏం జరిగిందని తెలిసేలోపే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆనంద, విషాదాల్లోనూ ఆయువు తీస్తోంది. కూతురు, కుమారుడి పెళ్లి సంబరాల్లో తండ్రి మరణించడం, భర్త చనిపోయాడన్న బాధలో భార్య గుండె ఆగిపోవడం జరుగుతున్నాయి. గట్టిగా డ్యాన్స్ చేసినా, ప్రశాంతంగా కూర్చున్నా కూడా హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోయింది. మొన్న గుజరాత్‌లో గార్బా ఆడుతూ పలువురు చనిపోయిన సంగతి విదితమే. తాజాగా తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక కుమారుడి హార్ట్ స్ట్రోక్ తో మరణించాడు.

ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. నరసాపురం పంటు రేవు ప్రాంతానికి చెందిన కిరాణా వ్యాపారి కార్మూరి వెంకట రత్నం, అలివేలు మంగతాయారు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కవల మగపిల్లలు. వీరిలో ఒకరు లక్ష్మణ్ కుమార్. తల్లి అలివేలు మంగళవారం అనారోగ్యానికి గురి కాగా, ఆమెను కుమారుడు లక్ష్మణ్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు ఆసుప్రతికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి ఇక లేదని తెలిసి కుమారుడు తల్లడిల్లిపోయాడు. ఆ వేదనలో ఉండగానే లక్ష్మణ్ కుమార్‌కు గుండె పోటు రావడంతో వెంటనే ఆసుప్రతికి తరలించగా.. అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. తల్లి కుమారులిద్దరూ కేవలం రెండు మూడు గంటల వ్యవధిలో ప్రాణాలు విడవడం అందరినీ కలచివేసింది.

ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దర్ని పొగొట్టుకున్న వేదనలో కూరుకుపోయారు కుటుంబ సభ్యులు. లక్మణ్ కుమార్ కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. తల్లిదండ్రులంటే విపరీతమైన గౌరవంతో లక్ష్మణ్ ఉండేవాడని, వారికి చెప్పకుండా ఏ పని చేసేవాడు కాదని స్థానికులు చెబుతున్నారు. వారిపై ఎనలేని ప్రేమ కురిపించేవాడని చెబుతున్నారు. తల్లి లేదని తెలిసి కుమారుడు ఆవేదనతో మరణించడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇంత బలహీనంగా గుండె పోటు రావడానికి కారణాలేమని భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి