Mohan Babu: కృష్ణం రాజు గారు ప్రభాస్ కోసం రాసిన కథ.. విష్ణు కోసం ఇచ్చేశారు :మోహన్ బాబు

Mohan Babu: కృష్ణం రాజు గారు ప్రభాస్ కోసం రాసిన కథ.. విష్ణు కోసం ఇచ్చేశారు :మోహన్ బాబు

కన్నప్ప సినిమా మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో మోహన్ బాబు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కన్నప్ప సినిమా మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో మోహన్ బాబు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కన్నప్ప సినిమా గురించి ఇప్పటికే అందరికి బాగా హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాను దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు మోహన్ బాబు. కాగా ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మమ్ముట్టి, ప్రభాస్, కాజల్, నేహాశెట్టి లాంటి ఎంతో మంది పాపులర్ సెలబ్రిటీస్ ఈ మూవీలో ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అందరిని బాగా మెప్పించేస్తున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో మోహన్ బాబు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

తాజాగా కన్నప్ప సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్.. ఈ సినిమాపై ఇంకాస్త హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ ఈవెంట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ కన్నప్ప సినిమాను ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశామని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. “ఈ సినిమా ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. ధూర్జటి మహాకవి భక్తి భావం ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అనే విషయాలను ఈ సినిమాలో అద్భుతంగా చుపించాము. ఇక ఈ సినిమాలో భారత దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు . ఇది కేవలం భక్తి చిత్రమే కాదు.. ఇందులో అన్ని రకాల అంశాలు ఉంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాము.” అంటూ చెప్పుకొచ్చారు మోహన్ బాబు.

అంతేకాకుండా ఈ సినిమా గురించి కృష్ణం రాజు గారితో మాట్లాడిన విషయం మాట్లాడుతూ.. “ముందుగా ఈ సినిమా గురించి కృష్ణంరాజు గారితో మాట్లాడాము .. మంచు విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నానని చెప్పినపుడు .. ప్రభాస్ కోసం రాసుకున్న కథను కూడా ఇచ్చేశారు. కన్నప్ప సినిమా కోసం ఇంకా ఎన్నో ఈవెంట్స్ నిర్వహిస్తాము.. నిర్మాతలకే కాకుండా కన్నప్ప టీమ్ కు కూడా ప్రజల ఆశీస్సులు కావలి” అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్రలు ఏమై ఉంటుందా అని.. ప్రభాస్ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి కన్నప్ప మూవీ విషయమై.. మోహన్ బాబు స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments