టీ20 వరల్డ్‌ కప్‌లో ఆ ఇద్దరు భారత ఆటగాళ్లే నా టార్గెట్‌: పాక్‌ పేసర్‌

టీ20 వరల్డ్‌ కప్‌లో ఆ ఇద్దరు భారత ఆటగాళ్లే నా టార్గెట్‌: పాక్‌ పేసర్‌

Mohammad Amir, Virat Kohli, Rohit Sharma: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 లాంటి ప్రతిష‍్టాత్మక టోర్నీలో ఆ ఇద్దరు భారత ఆటగాళ్లే తన టార్గెట్‌ అంటూ పాకిస్థాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ ఆమీర్‌ అన్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఉన్నాయి..

Mohammad Amir, Virat Kohli, Rohit Sharma: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 లాంటి ప్రతిష‍్టాత్మక టోర్నీలో ఆ ఇద్దరు భారత ఆటగాళ్లే తన టార్గెట్‌ అంటూ పాకిస్థాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ ఆమీర్‌ అన్నాడు. దాని గురించి పూర్తి వివరాలు ఉన్నాయి..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు పాకిస్థాన్‌ ఆటగాళ్లు మాటల యుద్ధం మొదలెట్టేశారు. ఈ సారి టీ20 వరల్డ్‌ కప్‌లో తన టార్గెట్‌ ఆ ఇద్దరు భారత ఆటగాళ్లే అంటూ, ఆ ఇద్దర్ని మరోసారి అవుట్‌ చేస్తానంటూ.. పాకిస్థాన్‌ వెటరన్‌ పేసర్‌ మొహమ్మద్‌ ఆమీర్‌ పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా కూడా.. ఆమీర్‌ను తిరిగి పాకిస్థాన్‌ టీమ్‌లోకి తీసుకున్న విషయం తెలిసిందే. పైగా టీ20 వరల్డ్ కప్‌ 2024 లాంటి మెగా టోర్నీ కోసం ఎంపిక చేసి.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అందర్ని షాక్‌కు గురి చేసింది. అయితే.. టీమ్‌లో చోటు దక్కగానే.. ఆమీర్‌ తన నోటికి పనిచెప్పేశాడు.

టీమిండియా స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ గురించి మాట్లాడుతూ.. వారిద్దరిని మరోసారి అవుట్‌ చేస్తానంటూ పేర్కొన్నాడు. ‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో మరోసారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వికెట్లు తీయాలనే ఆశ ఉంది.’ అంటూ పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి లెఫ్ట్‌ పేసర్‌గా రికార్డ్‌ ఉన్న ఆమీర్‌.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి.. కామెంటేటర్‌గా, క్రికెట్‌ అనలిస్ట్‌గా పలు షోష్‌లో కూడా పాల్గొన్నాడు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ, ఒక్కసారిగా పాకిస్థాన్‌ టీమ్‌లోకి వచ్చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 సాధించడమే లక్ష్యంగా పీసీబీ(పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు) ఆ జట్టు ఆటగాళ్లకు ప్రత్యేకంగా ఆర్మీ ట్రైనింగ్‌ కూడా ఇప్పించింది.

ఆ స్క్వౌడ్‌లో ఆమీర్‌ కూడా ఉన్నాడు. తాజాగా టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌కే ఎంపికయ్యాడు. కాగా, జూన్‌ 2 నుంచి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను జూన్‌ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ మ్యాచ్‌ జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోంది. భారత్‌, పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవడంతో.. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. క్రికెట్‌లో ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి మ్యాచ్‌లో కోహ్లీ, రోహిత్‌లను అవుట్‌ చేస్తానని ఆమీర్‌ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments