Good News for Farmers: గుడ్ న్యూస్.. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు.. ఎప్పటి‌నుంచంటే?

గుడ్ న్యూస్.. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు.. ఎప్పటి‌నుంచంటే?

Good News for Farmers: తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అన్నదాతలకు మరో శుభవార్త తెలిపారు.

Good News for Farmers: తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా అన్నదాతలకు మరో శుభవార్త తెలిపారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీల హామీ నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ప్రారంభించారు. ఇదిలా ఉంటే రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన్ రైతులను ఆదుకున్నారు. తాజాగా తెలంగాణ రైతులకు మరో శుభవార్త అందించారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ. 15 వేల పంట పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదని ప్రతిక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి రూ.10 (రెండు విడతల్లో) అమలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఐదు ఎకరాలకు రైతు బంధు సాయం అందించగా.. మిగిలిగిన రైతులకు కూడా లోక్ సభ ఎన్నికల తర్వాత అందిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.తాజాగా రైతు భరోసా పథకం పై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్ డేట్ ఇచ్చారు. రైతులకు ఎకరానికి రూ.15 వేల సాయం అందిస్తామని.. వానాకాలం సీజన్ లో రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుందని తెలిపారు.

ఎకరాకు రూ.7500 చొప్పున రెండు విడతల్లో మొత్తం రూ. 15 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. గతంలో గుట్టలు, స్థిరాస్తి భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ప్రభుత్వం డబ్బులను విపరీతంగా దుర్వినియోగం చేసిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తుంది. తమ ప్రభుత్వం అసలైన పంట సాగు చేసే రైతులకు సాయం అందిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు కౌలు రైతులు, రైతు కూలీలకు అందించే సాయంపై విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు.

Show comments