• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » telangana » Minister Ktr Serious On Congress And Bjp

బీజేపీపై మంత్రి KTR సీరియస్.. చిల్లర సినిమాలంటూ..!

  • By singhj Published Date - 09:54 PM, Tue - 19 September 23 IST
బీజేపీపై మంత్రి KTR సీరియస్.. చిల్లర సినిమాలంటూ..!

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్​తో పాటు బీజేపీ నేతల్ని టార్గెట్ చేసుకొని ఆయన విమర్శలకు దిగారు. స్కామ్​లకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులు డబ్బులు బాగా సంపాదించి, వాటితో ఓట్లు కొనాలనుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. హస్తం పార్టీ నేతలు డబ్బులిస్తే తీసుకోవాలని.. ఓట్లు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఓటర్లకు సూచించారు. భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ బీఆర్ఎస్​లో చేరగా.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఆ తర్వాత హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అబద్ధపు హామీలను అస్సలు నమ్మొద్దన్నారు.

ముఖ్యమంత్రి ఎవరవుతారో గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ గనుక అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీం గ్యారెంటీ అన్నారాయన. హస్తం పార్టీ పవర్​లోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు సీఎంలు, రాజకీయ అస్థిరత గ్యారెంటీ అని కేటీఆర్ చెప్పారు. ఆరు గ్యారెంటీలంటూ డైలాగులు కొట్టిన కాంగ్రెస్ డెవలప్​మెంట్​ మీద ఒక్క మాటైనా చెప్పిందా అని ఆయన ప్రశ్నించారు. పేదల్ని మభ్య పెట్టి ఓట్లు దండుకోవాలనేదే ఆ పార్టీ ఆలోచన అని.. రాష్ట్ర అభివృద్ధిపై వారికి ఆలోచనే లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయిందని మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేశారు. కేసీఆర్ రైతుబంధు కావాలా.. కాంగ్రెస్ రాబందులు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. బీజేపీ మీదా ఆయన విమర్శలు గుప్పించారు. ‘ప్రధాని మోడీ భ్రమల నుంచి ప్రజలు బయటపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధైర్యం ఉంటే 18 కోట్ల జాబ్స్ ఏమయ్యాయని మోడీ ఇంటి వద్ద ధర్నా చేయాలి. ‘రజాకార్’ చిత్రంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘రజాకార్’, ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ అంటూ ఎమోషన్స్​తో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ బీజేపీపై కేటీఆర్ సీరియస్ అయ్యారు.

ఇదీ చదవండి: ఇక వాట్సాప్​లోనే మూవీస్, క్రికెట్ అప్​డేట్స్!

Tags  

  • BJP
  • BRS
  • CM KCR
  • Congress Party
  • KTR
  • Movie News
  • Telangana

Related News

లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!

లక్షలు తీసుకునే రవళి కెరీర్‌ ఆ వార్తల వల్ల నాశనమైంది!

తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు రవళి.  ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. ఈ సినిమా సాధించిన విజయంతో ‘రవళి’ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. తర్వాత వరుస ఆఫర్లు ఆమెను వరించాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీబిజీగా అయిపోయారు. లక్షల్లో పారితోషికం తీసుకుంటూ ఉన్న ఆమె కెరీర్‌ ఒక్కసారిగా నేల కూలింది. అందుకు కారణం ఏంటనే విషయాన్ని ఆమె తల్లి విజయదుర్గ తాజాగా […]

5 hours ago
RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!

RC 16: రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు!

8 hours ago
ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!

ఆస్కార్ విజేతకు తప్పని తిప్పలు.. మరో వివాదంలో ఏఆర్ రెహమాన్!

9 hours ago
క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!

క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను బయటపెట్టిన హీరోయిన్‌!

10 hours ago
OTTలోకి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

OTTలోకి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

12 hours ago

తాజా వార్తలు

  • రతన్ టాటా జీవితంలో ఈ మహిళా చాలా ప్రత్యేకం.. ఆమె ఎవరో తెలుసా?
    5 hours ago
  • వీడియో: ప్రేయసితో కొరికించుకుని.. టాటూ వేయించుకున్న ప్రియుడు
    7 hours ago
  • దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఈ సారి 13 రోజులు..
    8 hours ago
  • రియల్‌ హీరో.. కూతుర్ని చంపిన వారి కోసం 37 ఏళ్ల అన్వేషణ!
    8 hours ago
  • రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం!
    8 hours ago
  • ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్మీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2.5 లక్షల జీతం!
    9 hours ago
  • రూ. 2 వేల నోట్లపై RBI కీలక నిర్ణయం.. మార్చుకునేందుకు అప్పటి వరకు ఛాన్స్
    10 hours ago

సంఘటనలు వార్తలు

  • సిరులు కురిపిస్తున్న కౌజు పిట్టల పెంపకం.. లక్షల్లో ఆదాయం!
    10 hours ago
  • 114 ఏళ్ల తర్వాత వెలుగులోకి మెడికల్‌ షాపు.. అందులో ఏమున్నాయంటే..
    10 hours ago
  • శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ మరో గుడ్ న్యూస్
    11 hours ago
  • బాబు ఫైబర్ గ్రిడ్ ఛీటింగ్ కి జనమే సాక్ష్యం: జర్నలిస్ట్ సాయి..
    11 hours ago
  • గొప్ప మనస్సు చాటుకున్న రతన్ టాటా.. ప్రశంసల వెల్లువ
    11 hours ago
  • వీడియో: లాంచ్ కి ముందే అనుష్క చేతిలో వన్ ప్లస్ ఓపెన్ ఫోన్!
    11 hours ago
  • వరల్డ్ కప్‌లో సచిన్ సెట్ చేసిన ఆ ఒక్క రికార్డు కొట్టే మగాడు ఎవడు?
    11 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version