APకి రెయిన్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

APకి రెయిన్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. శుక్రవారం నాడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. శుక్రవారం నాడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఇంతకాలం ఎండలు దంచికొట్టగా.. ప్రజలు వేడి ఉక్కపోతలతో అల్లాడిపోయారు. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరగడంతో జనం బయటికి వచ్చేందుకు బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫాన్ గా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రేపు అనగా శుక్రవారం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శని, ఆదివారాల్లోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.ఆదివారం వరకు మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. శని, ఆదివారాల్లోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని రేపటికి వాయుగుండంగా, ఎల్లుండి తూర్పుమధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని వెల్లడించింది వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. అవసరమైతే తప్పా ఎవరూ కూడా బయటికి రావొద్దని హెచ్చరించింది.

Show comments