Mammootty Turbo Movie OTT Streaming: సునీల్ విలన్ గా మమ్మూట్టి టర్బో మూవీ.. ఆ OTTలో స్ట్రీమింగ్!

సునీల్ విలన్ గా మమ్మూట్టి టర్బో మూవీ.. ఆ OTTలో స్ట్రీమింగ్!

Mammootty Turbo Movie OTT Details: మలయాళం మెగాస్టార్ మమ్మూట్టి నటించిన టర్బో చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు వచ్చేశాయి.

Mammootty Turbo Movie OTT Details: మలయాళం మెగాస్టార్ మమ్మూట్టి నటించిన టర్బో చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు వచ్చేశాయి.

మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి మరో సూపర్ డూపర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. టర్బో పేరు మమ్మూట్టి నిర్మించిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. నిజానికి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం రీసౌండింగ్ ఇస్తోంది. మొదటి రెండు రోజ్లులోనే ఏకంగా రూ.10 కోట్లు రాబట్టింది. కేవలం మలయాళం వర్షన్ లోనే ఈ మూవీని విడుదల చేశారు. కానీ, ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. పైగా ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు సొంతం చేసుకున్నారంట.

మమ్మూట్టి సినిమా అంటే పాన్ ఇండియా లెవల్లో ఆసక్తి ఉంటుంది. థియేటర్లలోనే కాకుండా.. ఓటీటీలో కూడా ఆయన సినిమాలకు మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. అందుకే మమ్మూట్టి సినిమాలకు ఓటీటీ ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఈ టర్బో సినిమాని ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ తో స్వయంగా నిర్మించారు. ఈ మూవీ మమ్మూట్టి ఇప్పటివరకు తెరకెక్కించిన హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ కావడం విశేషం. అంతేకాకుండా ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులకు ఒక కనెక్షన్ ఉంది. అదేంటంటే.. సునీల్ ఇందులో విలన్ గా చేశాడు. పైగా సునీల్ కి ఈ సినిమాతోనే మలయాళం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. గతంలో తమిళ్ డెబ్యూ మూవీ చేసిన సునీల్.. ఇప్పుడు మలయాళంలో కూడా అడుగుపెట్టేశాడు.

ఇంక ఈ టర్బో మూవీ ఓటీటీ విషయానికి వస్తే.. కళ్లు చెదిరే ధరకు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.25 కోట్లకు అమెజాన్ టర్బో చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ సొంతం చేసుకుందంట. ఇప్పుడు ఈ వార్త మలయాళం ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అతి త్వరలోనే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ మమ్మూట్టి హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. కన్నూరు స్క్వాడ్, కాథల్ ది కోర్, భ్రమయుగం సినిమాలతో పాన్ ఇండియన్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ టర్బో కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది.

కథ ఏంటంటే?:

టర్బో జోస్(మమ్మూట్టి) ఒక జీప్ డ్రైవర్. తనకు పరిచయం ఉన్న ఇద్దరు ప్రేమికులకు దగ్గరుండి పెళ్లి చేసి చెన్నైకి పంపిస్తాడు. వాళ్లు అక్కడకు వెళ్లిన తర్వాత ఊహించని చిక్కుల్లో పడతారు. వారిని రక్షించేందుకు, అండగా ఉండేందుకు టర్బో జోస్ కూడా చెన్నైకి వెళ్తాడు. అక్కడ ఒక పెద్ద రాజకీయ కింగ్ మేకర్, గ్యాంగ్ స్టర్ అయిన షణ్ముగ సుదరం(రాజ్ బీ శెట్టి)తో ఉన్న గొడవల్లోకి టర్బో జోస్ ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి కథ వేగం పెరుగుతుంది. అలాగే ట్విస్టులు, మలుపులు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ టెక్నికల్ వర్క్ బాగా నచ్చుతుంది. కెమెరా పనితనం మెప్పిస్తుంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటన కావాల్సి ఉంది.

Show comments