హేమ రేవ్ పార్టీకి వెళ్లింది నిజమే! నెట్టింట ప్రత్యక్షమైన ఆధారాలు!

హేమ రేవ్ పార్టీకి వెళ్లింది నిజమే! నెట్టింట ప్రత్యక్షమైన ఆధారాలు!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందులో నటి హేమ కూడా ఉన్నారని అక్కడి పోలీసులు ప్రకటించారు. అయితే హేమ పార్టీకి వెళ్లింది నిజమే అంటూ ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇందులో నటి హేమ కూడా ఉన్నారని అక్కడి పోలీసులు ప్రకటించారు. అయితే హేమ పార్టీకి వెళ్లింది నిజమే అంటూ ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

బెంగుళూరులో కలకలం రేపిన రేవ్ పార్టీ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించగా సినీ, రాజకీయ ప్రముఖులు అందులో పాల్గొన్నారు. దీంతో సినీ పరిశ్రమలో అలజడి రేగింది. రేవ్ పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో బెంగుళూరు పోలీసులు రైడ్ చేసి రెడ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రేప్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు పట్టుబడ్డారని తేలడంతో మరింత హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారం. ముఖ్యంగా నటి హేమ ఈ రేవ్ పార్టీ కేసు లిస్ట్ లో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే అంతకు ముందు తాను రేవ్ పార్టీలో లేనని నటి హేమ నమ్మించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ప్రముఖ మీడియా సంస్థ హేమ రేవ్ పార్టీకి వెళ్లింది నిజమే అంటూ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆధారాలాను బయటపెట్టింది.

బెంగళూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. కాగా ఈ రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారు. మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న 101 మందిలో రక్త పరీక్షలు చేయగా 85 మంది డ్రగ్స్ వాడినట్టు తేలింది. అందులో నటి హేమ కూడా ఉన్నారు. కాగా దీన్నుంచి తప్పించుకునేందుకు హేమ సర్వ ప్రయత్నాలు చేసింది. కానీ అడ్డంగా బుక్కయ్యింది. తాను ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేసింది. కానీ బెంగళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీలో ఉన్నట్లు ప్రకటించడంతో అసలు బండారం బయటపడింది. రేవ్ పార్టీలో తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని బయటపడింది. బెంగళూర్ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని నిరూపించేందుకు మరో కచ్చితమైన ఆధారాన్ని ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది.

మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. నటి హేమ మే 18న (శనివారం) రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారని తెలిపింది. మధ్యాహ్నం 1.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో హేమ ఉన్నారని చెప్పింది. ఇండిగో 6ఈ- 6305 విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్, తదితరులు ఉన్నారని వెల్లడించింది. హేమ తీసుకున్న ఫ్లైట్ టికెట్ కాపీ తమ వద్ద ఉన్నట్లుగా మీడియా సంస్థ ప్రకటించింది. శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు హేమ బెంగళూరు చేరుకుంది. అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్ట్‌కు హేమ అండ్ కో వెళ్లినట్లు తెలిపింది.

Show comments