Marvel Studios New Lady Super Hero Series: మాటలు రావు.. కాలు లేదు.. OTTలో ఈ లేడీ సూపర్ హీరో నెక్ట్స్ లెవల్ అంతే!

మాటలు రావు.. కాలు లేదు.. OTTలో ఈ లేడీ సూపర్ హీరో నెక్ట్స్ లెవల్ అంతే!

Marvel Studios Best Lady Superhero Series: ఓటీటీలో మీరు మార్వెల్ స్టూడియోస్ కి సంబంధించిన ఎన్నో సినిమాలు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు మార్వెల్ నుంచి ఒక కొత్త లేడీ సూపర్ హీరో సిరీస్ వచ్చేసింది. ఈ సిరీస్ ని మీరు ఇంకా చూడకపోతే మాత్రం వెంటనే స్టార్ట్ చేసేయండి.

Marvel Studios Best Lady Superhero Series: ఓటీటీలో మీరు మార్వెల్ స్టూడియోస్ కి సంబంధించిన ఎన్నో సినిమాలు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు మార్వెల్ నుంచి ఒక కొత్త లేడీ సూపర్ హీరో సిరీస్ వచ్చేసింది. ఈ సిరీస్ ని మీరు ఇంకా చూడకపోతే మాత్రం వెంటనే స్టార్ట్ చేసేయండి.

సూపర్ హీరో సినిమాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పంది. కొందరైతే సినిమా వచ్చీ రాకుండానే చూసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే ఆ సూపర్ హీరో సినిమాలు తప్పితే మరో సినిమా చూడరు. అలాంటి సూపర్ హీరో సినిమాలు చూసే వారికి మార్వెల్ స్టూడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందులో ఉన్న ప్రతి సూపర్ హీరో గురించి అందరూ చూసేశారు. కానీ, ఆ యూనివర్స్ లోకి ఒక లేడీ సూపర్ హీరో కొత్తగా వచ్చింది. ఆమె రావడం మాత్రమే కాదు.. ఫ్యాన్స్ అందరినీ ఫిదా చేసేసింది. ఆల్రెడీ మార్వెల్ ఫ్యాన్స్ ఈ సిరీస్ ని చూసేశారు. కానీ, ఈ సిరీస్ డెప్త్ తెలియక చాలా మంది ఫ్యాన్స్ చూడటం లేదు.

మార్వెల్ స్టూడియోస్ నుంచి ఒక సినిమా లేదా సిరీస్ వస్తోంది అంటే కచ్చితంగా ఫ్యాన్స్ అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే అది కచ్చితంగా హిట్టు అని రిలీజ్ కి ముందే ఫిక్స్ అవుతారు. వారి అంచనాలను ఎప్పుడూ మార్వెల్ స్టూడియోస్ తగ్గించలేదు. ఈ సిరీస్ లో కూడా మార్వెల్ అదే తరహా డెడికేషన్ చూపించారు. ఈ సిరీస్ కూడా అద్భుతంగా ఉంది అని ఫ్యాన్స్ ఇప్పటికే రివ్యూలు కూడా ఇచ్చేశారు. అంతేకాకుండా.. ఒక కొత్త సూపర్ హీరో ఆగమనం కాబట్టి ఇంకా అలర్ట్ అయ్యి చూసేశారు. ఈ సిరీస్ కథ పరంగా, కొత్త సూపర్ హీరో బ్యాగ్రౌండ్ పరంగా చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించింది.

సాధారణంగా సూపర్ హీరో అంటే ఫిట్ గా ఉండాలి. కానీ, ఈసారి మాత్రం ఆ రూల్ ని పక్కన పెట్టేశారు. ఈ సూపర్ హీరోకి చెవులు వినిపించవు, ఆమె అసలు మాట్లాడదు, కేవలం సైగలు మాత్రమే చేస్తూ ఉంటుంది. వాటికి తోడు కాలు కూడా లేదు. ఇన్ని చెప్పిన తర్వాత ఎవరైనా కూడా అసలు సూపర్ హీరో ఎలా అవుతుంది అంటూ కామెంట్స్ చేయచ్చు. కానీ, సిరీస్ చూస్తే మాత్రం వావ్ అంటారు. ఎందుకంటే ఒక్కో ఎపిసోడ్, ఒక్కో సీన్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అంతేకాకుండా.. యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవల్ అంతే. సూపర్ హీరో అంటే కచ్చితంగా మినిమం ఉంటది మరి.

ఈ వెబ్ సిరీస్లో ఆ పార్ట్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంటుంది. లేడీ సూపర్ హీరో కదా.. ఏం ఉంటదిలే అని లైట్ తీసుకోవద్దు. ఒక అమాయకురాలు అయిన మాయను ఒక వ్యక్తి చిన్నప్పుడే తనతో తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత ఆమెలో ఉన్న శక్తిని వెలికి తీసి ఆమెను ఒక పరాజయం తెలియని సూపర్ మహిళగా మారుస్తాడు. ఆ తర్వాత అతనికి కావాల్సిన పనులు చేయించుకుంటూ ఉంటాడు. ఈ సిరీస్ పేరు ‘ఎకో’. ఇది మార్వెస్ స్టూడియోస్ నుంచి వచ్చిన కొత్త సూపర్ హీరో సిరీస్. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Show comments