Manjummel Boys- OTT Suggestions: మంజుమ్మెల్ బాయ్స్ హీరో నటించిన ఈ సూపర్ హిట్ మూవీ చూశారా?

మంజుమ్మెల్ బాయ్స్ హీరో నటించిన ఈ సూపర్ హిట్ మూవీ చూశారా?

Super Hit Movie OTT Suggestions: మంజుమ్మెల్ బాయ్స్ క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. అయితే ఈ సినిమా హీరో నటించి ఇదే తరహా సూపర్ హిట్ సినిమా ఓటీటీలో ఉంది. మరి ఆ సినిమా మీరు చూశారా?

Super Hit Movie OTT Suggestions: మంజుమ్మెల్ బాయ్స్ క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. అయితే ఈ సినిమా హీరో నటించి ఇదే తరహా సూపర్ హిట్ సినిమా ఓటీటీలో ఉంది. మరి ఆ సినిమా మీరు చూశారా?

మంజుమ్మెల్ బాయ్స్.. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.120 కోట్లకు పైగా సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ కాబోతోంది. మార్చి 15న ఈ మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వర్షన్ విడుదల కాబోతోందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ మూవీలో ఉన్న ఒక హీరో నటించిన సూపర్ హిట్ మూవీ ఓటీటీలో ఉంది. ఆ మూవీ కూడా కాస్త అటూ ఇటూగా మంజుమ్మెల్ బాయ్స్ లాగానే కుర్రాళ్ల జీవితాల ఆధారంగా నడిచే సినిమా. మరి.. ఆ మూవీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూద్దాం.

మంజుమ్మెల్ బాయ్స్ లో సిజు డేవిడ్ పాత్ర పోషించిన హీరో సౌబిన్ షాహిర్ నటించిందే ఈ చిత్రం. ఇది కూడా మంజుమ్మెల్ బాయ్స్ తరహాలో మిత్రుల మధ్య జరిగే కథే. అయితే వీళ్లు ఎక్కడికీ వెళ్లరు ఒక ఇంట్లోనే ఉంటారు. కథ కూడా ఆ ఇంట్లోనే జరుగుతూ ఉంటుంది. బెంగళూరుకు అవుట స్కట్స్ లో ఉండే ఇంట్లో మొత్తం 8 మంది కుర్రాళ్లు ఉంటారు. వారి జీవితాల నేపథ్యంలోనే ఈ మూవీ సాగుతూ ఉంటుంది. ఆ మూవీ మరేదో కాదు.. 2023లో విడుదలైన రోమాంచం.

ఈ రోమాంచం మూవీ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. నిజానికి ఇది వచ్చి చాలారోజులు అవుతున్నా దీని గురించి చాలామందికి తెలియదు. అయితే చూసినవాళ్లు మాత్రం ఎప్పుడు బోర్ కొట్టినా మరోసారి చూసేస్తూ ఉంటారు. ఈ మూవీలో సౌబిన్ షాహిర్ పాత్ర ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అలాగే వాళ్లు దెయ్యంతో పడే పాట్లు.. ఒకరితో ఒకరికి మధ్య జరిగే ఫన్ బాగుంటుంది. పైగా ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన కథ. ఓజో బోర్డు, దెయ్యాలతో మాట్లాడే కాన్సెప్ట్ మీద ఈ మూవీని నిర్మించారు. ఒకవైపు భయం వేస్తూనే ఉంటుంది. మరోవైపు కడుపుబ్బా నవ్వేసుకుంటూ ఉంటాం.

కథ ఏంటంటే?:

బెంగళూరు సిటీకి చివర ఒక ఇంట్లో 8 మంది కుర్రాళ్లు అద్దె ఇంట్లో ఉంటూ ఉంటారు. వారిలో కొందరు ఉద్యోగం చేస్తుంటారు. కొందరు మాత్రం ఖాళీగా ఇంట్లోనే ఉటూ ఉంటారు. వారికి ఏం తోచక ఇంట్లో ఏం చెయ్యాలో తెలియక క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉంటారు. వారిలో వారికి పెద్దగా పడదు. ఒకరు ఒక మాట చెబితే ఇంకొకరు ఇంకో మాట చెప్తారు. అలా అర్థం పర్థం లేకుండా కాలం గడిపేస్తున్న సమయంలో వారు ఓజో అనే ప్రమాదకరమైన ఆట గురించి వింటారు. దానిని ఎలాగైనా ఆడాలి అనుకుంటారు. నిజానికి దానిని చాలా సరదాగా స్టార్ట్ చేస్తారు. సౌబిన్ షాహిర్ తన ఫ్రెండ్ తో కలిసి అనామిక అనే ఆత్మను సృష్టిస్తాడు. రూమ్ మేట్స్ ని భయపెట్టాలి అని ఆ పని చేస్తాడు. కానీ, అనామిక నిజంగానే వస్తుంది. వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటుంది. మరి.. ఓజో బోర్డు ఆట నిజమేనా? అసలు ఆ అనామిక దెయ్యం ఎవరు? ఎందుకు చనిపోయింది? వారి పరిస్థితి ఏంటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే రోమాంచం సినిమా చూడాల్సిందే.

Show comments