Lottery: చేసిన పొరపాటు అతన్ని లక్షాధికారిని చేసింది.. లాటరీలో 26 లక్షలు గెలుచుకున్న ట్రక్ డ్రైవర్

చేసిన పొరపాటు అతన్ని లక్షాధికారిని చేసింది.. లాటరీలో 26 లక్షలు గెలుచుకున్న ట్రక్ డ్రైవర్

Man Won Lottery By Mistake: ఓ ట్రక్ డ్రైవర్ కి లాటరీలో 26 లక్షల రూపాయలు తగిలాయి. పొరపాటున లాటరీ టికెట్ కొనుగోలు చేయడం అతన్ని లక్షాధికారిని చేసింది.  

Man Won Lottery By Mistake: ఓ ట్రక్ డ్రైవర్ కి లాటరీలో 26 లక్షల రూపాయలు తగిలాయి. పొరపాటున లాటరీ టికెట్ కొనుగోలు చేయడం అతన్ని లక్షాధికారిని చేసింది.  

ఒక వ్యక్తి చేసిన పొరపాటు అతన్ని లక్షాధికారిని చేసింది. లాటరీ టికెట్లు కొనే సమయంలో చేసిన పొరపాటు వల్ల ఆటను ఏకంగా 26 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. అమెరికాలోని బాల్టిమోర్ లో మేరీ ల్యాండ్ లాటరీ ప్లేయర్ 32 వేల డాలర్లను లాటరీలో గెలుచుకున్నాడు. నార్త్ పాయింట్ లిక్కర్ అండ్ బార్ దగ్గర కెనో టికెట్ కొనుగోలు చేశానని.. అయితే బోనస్ ఆప్షన్ అనేది ఖరీదైనదని తెలుసుకున్నానని అన్నాడు. 10 గేమ్స్ కోసం 10 స్పాట్ కెనో టికెట్స్ ని కొనుగోలు చేశాడు.

బోనస్ టికెట్స్ 40 డాలర్లని చెప్పడంతో అతను తన దగ్గర ఉన్న సాధారణ టికెట్లను ఇచ్చేసి 40 డాలర్ల బోనస్ టికెట్ ని తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే లక్కీ డ్రా తీస్తుండగా.. ఆ వ్యక్తి నంబర్లు కనిపిస్తున్నాయి. 10 నంబర్స్ లో 9 నంబర్లు కనిపించాయి. అతని టికెట్ ని స్కాన్ చేయగా.. అదృష్టం వరించింది. 40 డాలర్ల బోనస్ టికెట్ ని తీసుకోవడం మంచి జరిగిందని అతను చెప్పుకొచ్చాడు. 32 వేల డాలర్లు గెలుచుకున్నానని వెల్లడించాడు.

ఆ లాటరీ డబ్బుని పొదుపు చేసుకుంటా అని వెల్లడించాడు. అంతకు ముందు మేరీలాండ్ దంపతులు తమకు తెలియకుండానే పవర్ బాల్ డ్రాయింగ్ కోసం ఒకే నంబర్ కలిగిన రెండు టికెట్లను కొనుగోలు చేశారు. ఆ పొరపాటే వారికి 16 కోట్లు తెచ్చి పెట్టింది. 2 మిలియన్ డాలర్లు లాటరీలో గెలుచుకున్నారు. ఏప్రిల్ నెలలో వర్జీనియా లాటరీ ప్లేయర్ అనుకోకుండా 1 మిలియన్ డాలర్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. లాటరీ వెండింగ్ మెషిన్ లో తప్పుడు బటన్ నొక్కడంతో ఈ మొత్తాన్ని గెలుచుకున్నాడు. 

Show comments