వీడియో: రీల్స్ పిచ్చితో అడవి ఏనుగుతో పరాచకాలు.. చివరికి ఏం జరిగిందంటే?

వీడియో: రీల్స్ పిచ్చితో అడవి ఏనుగుతో పరాచకాలు.. చివరికి ఏం జరిగిందంటే?

తాజాగా ఏనుగుతో రీల్ చేసేందుకు ప్రయతత్నించిన ఓ యువకుడు దానిని తరిమేందుకు సహసం చేశాడు. కానీ, చివరికి ఏం జరిగిందంటే..?

తాజాగా ఏనుగుతో రీల్ చేసేందుకు ప్రయతత్నించిన ఓ యువకుడు దానిని తరిమేందుకు సహసం చేశాడు. కానీ, చివరికి ఏం జరిగిందంటే..?

ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అనేది ఏ స్థాయిలో ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సోషల్ మీడియా వినియోగం అందుబాటులోకి వచ్చిన నుంచి చాలామంది రీల్స్ పిచ్చితో మితిమీరిపోతున్నారు. ఈ క్రమంలోనే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతిఒక్కరూ ఇరవైనాలుగు గంటలు రీల్స్ మోజులో పడి ఈ ప్రపంచాన్నే మార్చిపోతున్నారు.ఇక ఈ రీల్స్ యుగంలో.. విపరీతమైన క్రేజ్, భారీ ఫాలోవర్స్, లక్షకొలది లైక్స్ రావడం కోసం కొంతమంది ఏకంగా ప్రాణాలను కూడా రిస్క్ చేస్తున్నారు. మరి కొంతమంది విచిత్రమైన ఆలోచనలతో ఎవ్వరూ ఊహించని పనులు చేస్తూ.. ప్రాణాలనే పొగొట్టుకుంటారు. ఇలా నిత్యం సోషల్ మీడియాలో ఫన్నీ రీల్స్ తో పాటు మరికొన్ని షాకింగ్ వీడియోలు కూడా వైరల్ అవ్వడంతో.. వీటిని చూసిన నెటిజన్స్ విమర్శలతో దుమ్మెత్తి పోస్తుంటారు. కాగా, ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ప్రాణాలను పొగొట్టుకునే ఘటనలు చాలానే వింటుటాం. అయితే తాజాగా ఈ క్రమంలోనే ఏనుగుతో రీల్ చేయాలనుకునే యువకుడు సహసం చివరికి ఏం జరిగిందంటే..?

తాజాగా ఏనుగుతో రీల్ చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి కోరి చావును కొనితెచ్చుకున్నట్లయింది. అయితే ఓ యువకుడు అడవి ఏనుగును భయపెట్టి దానిని తరిమేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆ ఏనుగు ఆగ్రహంతో ఊగిపోయింది. దీంతో ఘీకారం చేస్తూ.. అతని వెంటపడింది. ఈ క్రమంలోనే తొండంతో విసిరి నేలకేసి కొట్టింది. ఇక అంతటితొ ఆగని ఏనుగు.. అతన్ని తన కాలుతో తొక్కి చంపేసింది. ప్రస్తుతం ఇందకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ భయంకరమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌ జిల్లాలో చోటు చేసుకుంది.ఆ వివరాల్లోకి వెళితే.. అడవి నుంచి బయటకు వచ్చే ఓ ఏనుగు బిజ్నోర్ జిల్లాలో పలు గ్రామాల్లో సంచరించింది. ఈ క్రమంలోనే.. గురువారం ఉదయం హబీబావాలా గ్రామంలోకి  ఆ ఏనుగు ప్రవేశించింది. దీంతో ఆ ఏనుగును చూసేందుకు ఆ గ్రామస్తులు పెద్ద సంఖ్యలోనే గుమిగూారు. కానీ, ఇంతలోనే బాగ్దాద్ అన్సార్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల ముర్సాలీన్‌  ఆ ఏనుగుతో రీల్ చేసేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలోనే.. ఏనుగును భయపెట్టి తరిమేందుకు దాని సమీపానికి వెళ్లాడు. ఇక ఆ యువకుడు చేసిన పనికి ఆగ్రహానికి గురైన గజరాజు.. అతడి వెంటపడింది. దీంతీ ఆ వ్యక్తితోపాటు అక్కడున్న జనం భయంతో పరుగులు తీశారు. అయితే ముర్సాలీన్‌ను సమీపించిన ఏనుగు కాళ్లతో అతడ్ని తొక్కింది. అలాగే తొండంతో  25 అడుగుల ఎత్తుకు విసిరికొట్టింది. ఇక ఆ ఏనుగు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు ఈ  ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే  ఏనుగు సంచారం గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ఏనుగును తిరిగి అడవిలోకి పంపించేశారు. కాగా, ఏనుగు దాడి నుంచి తప్పించుకునేందుకు ముర్సాలీన్‌, రీల్‌ రికార్డు చేసే వ్యక్తి, ఇతరులు పరుగు తీసిన వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి, రీల్స్ పిచ్చితో  అడవి ఏనుగు దాడిలో ప్రాణలు పోగట్టుకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments