వీడియో: భార్య అలిగి వెళ్లిందని.. కరెంట్ స్తంభం ఎక్కిన భర్త.. చివరకు!

వీడియో: భార్య అలిగి వెళ్లిందని.. కరెంట్ స్తంభం ఎక్కిన భర్త.. చివరకు!

ఇటీవల కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కొందరు తాగిన మైకంలో తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్య వెళ్లిపోయిందనని కరెంట్ స్తంభం ఎక్కి..చివరకు...

ఇటీవల కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కొందరు తాగిన మైకంలో తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి భార్య వెళ్లిపోయిందనని కరెంట్ స్తంభం ఎక్కి..చివరకు...

భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి సర్వసాధారణం. రేయింబవళ్లు వచ్చినట్లుగానే సంసారంలో గొడవలు అనేవి వచ్చిపోతుంటాయి. అలా వచ్చిన సందర్భంలో సర్థుకుపోతూ సంసారాన్ని సాగించాలి. అయితే కొందరు మాత్రం పంతాలకు పోతున్నారు. ముఖ్యంగా నేటికాలంలో దంపతులు పంతాలకు పోయి..సంసారాన్ని నిట్టనిలువును కూల్చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే..గొడవలు జరిగిన సందర్భంల్లో  దంపతుల్లో ఎవరో ఒకరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి..తన భార్య అలిగి వెళ్లిపోయిందని, హైటెన్షన్ కరెంట్ తీగలు వెళ్తున్న స్తంభం ఎక్కాడు. చాలా సేపు రచ్చ రచ్చ చేశాడు. చివరకు ఏం జరిగిందంటే.. పూర్తి.. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల కాలంలో మద్యం సేవించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. కొందరు తాగిన మైకంలో తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా కొందరు భర్తలు..తమ భార్యపై కోపంతో తాగి..చాలా దారుణాలకు పాల్పడుతున్నారు. అంతేకాక తాగిన మైకంలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి.. భార్యతో గొడవపడ్డాడు. ఆ తరువాత విద్యుత్‌ స్థంభం ఎక్కి హల్‌చల్‌ చేశాడు. చాలా సేపు స్థానికులను, పోలీసులను ముచ్చెమటలు పట్టించాడు.

బుధవారం సైదాబాద్ ప్రాంతంలోని సింగరేణి కాలనీలో నివసించే దినసరి కూలి మోహన్‌బాబు (25) మద్యం సేవించి భార్యతో గొడవ పడ్డాడు. ఇక అతడిపై కోపంతో అగిలిగి భార్య బయటకు వెళ్లింది. భార్య వెళ్లిపోయిందని మోహన్ భాబు శంకేశ్వర్ బజార్ చౌరస్తాలోని హైటెన్షన్‌ తీగలు వెళ్తున్న విద్యుత్‌ స్తంభం ఎక్కాడు. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు, విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు వెంటనే కరెంట్ ను నిలిపిశారు. అనంతరం పోలీసులు  అక్కడికి చేరుకుని అతనికి నచ్చచెప్పి కిందికి దించే ప్రయత్నం చేశారు.

చాలా సేపు పోలీసులకు, స్థానికులకు ముచ్చెమటలు పట్టించిన సదరు వ్యక్తి ఎట్టకేటలకు కిందకు దిగాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. గంటసేపు మోహన్ బాబు డ్రామా స్థానికంగా కలకలం సృష్టించింది. మరోసారి ఇలా చేయకుండా పోలీసులు తమదైన శైలీలో కౌన్సెలింగ్‌ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అయితే అతడు ఇలా చేయడం ఇది తొలిసారి కాదు  ఇతడు రెండేళ్లలో ఇలా ఐదుసార్లు కరెంట్ స్తంభం ఎక్కాడు. భార్య తిట్టినా, కోపం వచ్చినా ఇలాంటి పనులు చేస్తాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అతడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments