iDreamPost

Pokiri మళ్ళీ వెండితెరపై పోకిరి ఒక్కడు మేజిక్

Pokiri మళ్ళీ వెండితెరపై పోకిరి ఒక్కడు మేజిక్

ఒకప్పుడు ఏదైనా కొత్త సినిమా థియేటర్లో ఆడి వెళ్ళిపోయాక తిరిగి కొన్ని నెలలు లేదా సంవత్సరాలకు రీ రిలీజ్ చేసేవారు. హిట్ చిత్రాలకు మంచి కలెక్షన్లు వచ్చేవి. దానవీరశూరకర్ణ 1990లో పునఃవిడుదల చేసినప్పుడు కోటి రూపాయలకు పైగా వసూలు చేయడం ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డు. షోలే, అడవిరాముడు, ఖైదీ, శివ, ఘరానా మొగుడులు ఎన్నిసార్లు వచ్చేవో లెక్క బెట్టడం కష్టం. అప్పట్లో ఆన్ లైన్ లేదు కాబట్టి కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే ఉండేవి. అయితే థియేటర్ లేదా వీడియో క్యాసెట్ అంతే. రెండోది ఖరీదైన వ్యవహారం కాబట్టి సామాన్యులు హాలుకే వెళ్లి సినిమా చూసేవాళ్ళు. ఇప్పుడంతా పోయింది. రెండు మూడు వారాల లైఫ్ దొరికితేనే గొప్ప.

అయినా కూడా ఒకప్పటి బ్లాక్ బస్టర్స్ ని మళ్ళీ స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్న అభిమానులు బోలెడున్నారు. కానీ విపరీతంగా పెరిగిపోయిన వ్యయంతో పాటు దాదాపు ప్రతి సినిమా అందుబాటులో ఉండటంతో ఎగ్జిబిటర్లు వీటి మీద ఆసక్తి చూపించడం లేదు. గత రెండేళ్లలో ఈ ట్రెండ్ హైదరాబాద్ లో మొదలయ్యింది. ఆది, చెన్నకేశవరెడ్డి, మగధీర, తుపాకీ లాంటివి స్పెషల్ షోల పేరుతో ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా ప్రదర్శించారు. కాకపోతే ఇవి అన్ని ప్రాంతాలకు రీచ్ అవ్వలేదు. ఇప్పుడా కొరత మహేష్ అభిమానులకు తీరబోతోంది. పోకిరిని 4K క్వాలిటీకి రీ మాస్టర్ చేసి డాల్బీ సౌండ్ తో మిక్స్ చేసి ఆగస్ట్ 9 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా విడుదల చేయబోతున్నారు.

ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్స్ ని ఇలా బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశం రావడం కన్నా గొప్ప ఛాన్స్ ఏముంటుంది. అందులోనూ పండుగాడుగా మహేష్ చేసిన ఊర మాస్ పెర్ఫార్మన్స్ ఇప్పటి జెనరేషన్ లో కొందరు థియేటర్లలో చూసి ఉండరు. సో వాళ్ళకిది గూస్ బంప్స్ మూమెంట్ అవుతుంది. ఇదొక్కటే కాకుండా ఒక్కడు కూడా ఇదే తరహా ప్లానింగ్ లో ఉందట. మణిశర్మ సంగీతం అందించిన గొప్ప మ్యూజికల్ ట్రీట్స్ ఇవి. ఆగస్ట్ 9న సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రీమియర్లు ఉండబోతున్నాయి. ఎన్నో ఏళ్ళ తర్వాత ఒక రీ రిలీజ్ మూవీకి భారీ ఎత్తున హంగామా వీటికి ఉండబోతోందని చెప్పడం ఎలాంటి అనుమానం అక్కర్లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి