Gautam Graduation Ceremony: వీడియో: గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో సూపర్ స్టార్ ఫ్యామిలీ..!

వీడియో: గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో సూపర్ స్టార్ ఫ్యామిలీ..!

Gautam Graduation Ceremony: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం విదేశాలకు ట్రిప్ కి వెళ్తుంటారు.

Gautam Graduation Ceremony: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం విదేశాలకు ట్రిప్ కి వెళ్తుంటారు.

తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా మారిన తర్వాత ‘మురారి’ చిత్రంతో వరుస విజయాలు అందుకున్నాడు. క్లాస్ గా ఉన్నా.. మాస్ ఇమేజ్ తో ప్రేక్షకుల మనసు దోచాడు. ఓ వైపు యాడ్స్, బిజినెస్ తో పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చెలామణి అవుతున్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కోసం చాలా సమయాన్ని కేటాయిస్తుంటారు మహేష్ బాబు. ఇక తన పిల్లలు గౌతమ్, సితార అంటే పంచ ప్రాణాలు.. ఒక తండ్రి గా కాకుండా ఒక స్నేహితుడిగా వారితో ఉంటారని పలు సందర్బాల్లో మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తెలిపింది. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో క్యూట్ ఫ్యామిలీగా పేరు తెచ్చుకున్నారు మహేష్ బాబు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ (ఇంటర్) పూర్తి చేసిన సందర్భంగా ఈ కపుల్స్ ఎంతో ఎమోషన్ అయ్యారు. ఈ ఆనందాన్ని మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గౌతమ్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మహేష్ బాబు. ‘నా మనసు ఎంతో గర్వంతో నిండిపోయింది.. నీ గ్రాడ్యుయేషన్ కి మనసారా అభినందనలు, నీ జీవితంలో తర్వాత పాఠం నువ్వే రాసుకోవాలి.. నువ్వు ఎప్పటిలాగే గొప్పగా రాణిస్తావని నమ్మకం ఉంది.. నీ కలలను ఎప్పుడూ వదలకు.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం.. ఈ రోజు నేను తండ్రిగా ఎంతో గర్వపడుతున్నాను’ అంటూ తన సంతోషాన్ని రాసుకొచ్చారు మహేష్ బాబు.

ఇక నమ్రత ‘మై డీయర్ జీజీ.. నీ లైఫ్ లో కొత్త చాప్టర్ ముందు నిలబడి ఉన్నావు.. ఈ రోజు నేను నిన్ను చూసి ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతున్నా.. నీ జీవితంలో ఎప్పటికీ నిజాయితీతో ఉండు.. నీ కలల సాకారం చేసుకోవడానికి ముందుకు సాగు.. మేము నీ ఆనందం కోరుకుంటున్నాం.. నీ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లినా.. మా ప్రేమ నీతో ఉంటుంది. ఈ ప్రపంచం ఇక నీదే.. లవ్ యూ సోమచ్’ అంటూ రాసుకొచ్చింది. మొత్తానికి పుత్రోత్సాహంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ముందు ముందు గొప్ప పొజీషన్ కి చేరుకోవాలని వారి తపన చూసి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Show comments